Bigg Boss 8 Telugu : నిఖిల్ టీంలోకి సోనియా, పృథ్వీ.. సీతకే సపోర్ట్ ఎక్కువ.. ప్రోమో చూశారా..?

|

Sep 25, 2024 | 12:22 PM

నిఖిల్, పృథ్వీ, సోనియా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని.. ఒకరితో మాట్లాడుతుంటే మరొకరు మధ్యలోకి వస్తున్నారని నేరుగా బిగ్ బాస్ కే కంప్లైయింట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హౌస్ లో మొదటి చీఫ్ నిఖిల్ కాగా.. రెండో చీఫ్ గా సీత ఎన్నికైంది. దీంతో మరోసారి రెండు కాన్లను సెలక్ట్ చేసుకోవాలని సూచించాడు బిగ్ బాస్.

Bigg Boss 8 Telugu : నిఖిల్ టీంలోకి సోనియా, పృథ్వీ.. సీతకే సపోర్ట్ ఎక్కువ.. ప్రోమో చూశారా..?
Bigg Boss 8 Telugu Promo
Follow us on

బిగ్‏బాస్ నాలుగో వారం నామినేషన్స్ తర్వాత జనాల్లో ఒక్కో కంటెస్టెంట్ గ్రాఫ్ తారుమారు అయ్యింది. జనాల్లో ఒక్కొక్కరి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా మొన్నటివరకు పూర్తిగా నెగిటివిటీని తెచ్చుకున్న యష్మీకి ఇప్పుడు సపోర్ట్ ఎక్కువగా పెరిగింది. నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ లో సోనియా ప్రవర్తన, మాట తీరుపై ఇచ్చిపడేసింది. యష్మీ కేవలం నిఖిల్, పృథ్వీలను మాత్రమే చూస్తుందని.. తన గేమ్ చూడడట్లేదని సోనియా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడడంతో యష్మీ బోరున ఏడ్చేసింది. అలాగే నామినేషన్స్ లో నబీల్ సైతం సోనియాకు గట్టిగానే కౌంటర్స్ ఇచ్చాడు. నిఖిల్, పృథ్వీ, సోనియా గ్రూప్ గేమ్ ఆడుతున్నారని.. ఒకరితో మాట్లాడుతుంటే మరొకరు మధ్యలోకి వస్తున్నారని నేరుగా బిగ్ బాస్ కే కంప్లైయింట్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హౌస్ లో మొదటి చీఫ్ నిఖిల్ కాగా.. రెండో చీఫ్ గా సీత ఎన్నికైంది. దీంతో మరోసారి రెండు కాన్లను సెలక్ట్ చేసుకోవాలని సూచించాడు బిగ్ బాస్.

తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ మొత్తం ఒకే మాట పై నిలబడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో నిఖిల్ ఒకరు. శక్తి క్లాన్ కు అతడు చీఫ్ కాగా.. కాంతార టీంకు సీత చీఫ్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ లోని సభ్యులు ఎవరు ఏ క్లాన్ లో ఉండాలనేది నిర్ణయించుకోవాలని సూచించాడు బిగ్ బాస్. దీంతో ముందుగా విష్ణు మాట్లాడుతూ.. శక్తి క్లాన్ లో తనకు సరైన గుర్తింపు లేదని.. అందుకే కాంతార టీంకు వెళ్లాలనుకున్నట్లు తెలిపింది. ఇక తర్వాత సోనియా ఎప్పటిలాగే నిఖిల్ క్లాన్ కు వెళ్లింది. నిఖిల్ టీం చాలా స్ట్రాంగ్ అని.. కానీ తనకు టాస్కులు ఆడే ఛాన్స్ మాత్రం రాలేదని.. తనకు టాస్కులో ఆడాలని ఉందంటూ సీత టీం సెలక్ట్ చేసుకుంది నైనిక.

అలాగే పృథ్వీ కూడా నిఖిల్ టీంలోకి వెళ్లిపోయాడు. తనకు సీత రియల్ అనిపిస్తుందని.. అందుకే తన టీంలోకి వెళ్తున్నట్లు చెప్పాడు నబీల్. ఇక ఆ తర్వాత ఈ హౌస్ లో తాను ఎలాంటి బాండ్, ఎమోషన్స్ పెంచుకోవాలని రాలేదని.. కాంతార టీం సెలక్ట్ చేసుకుంది యష్మీ. దీంతో ఒక్క నిమిషం బిగ్ బాస్ అంటూ మధ్యలో మాట్లాడేసింది ప్రేరణ. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే హౌస్ మొత్తం కాంతార టీం, సీతకు సపోర్ట్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్‏బాస్ ప్రోమో.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.