Bigg Boss 8 Telugu: కిచెన్‏లో కొత్త రూల్.. సైకోగాళ్లు అంటూ తిట్టిన అభయ్.. నబీల్‏కు విష్ణుప్రియ సారీ..

|

Sep 20, 2024 | 7:36 AM

ఇక నుంచి కిచెన్ లో ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్ లో ఒక్క సమయంలో ఒక్క టీమ్ మాత్రమే వంట చేయాలి. అలాగే టీమ్ వంట చేసేటప్పుడు ఆ టీంకు సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్ లో ఉండాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలోనే మీరు కూరగాయలు కోయడం కూడా లెక్కలోకి వస్తుందంటూ బిగ్‏బాస్ చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ షాకయ్యారు. కిచెన్ లో కొత్త రూల్ ఏంటీ అంటూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

Bigg Boss 8 Telugu: కిచెన్‏లో కొత్త రూల్.. సైకోగాళ్లు అంటూ తిట్టిన అభయ్.. నబీల్‏కు విష్ణుప్రియ సారీ..
Bigg Boss
Follow us on

బిగ్‏బాస్ హౌస్‏లో ప్రభావతి 2.0 టాస్క్ నడుస్తుంది. శక్తి, కాంతార టీమ్ ఎగ్స్ సంపాదించేందుకు తెగ కష్టపడుతున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‏లో మాత్రం రెండు టీమ్ సభ్యులు రెచ్చిపోయి కొట్టుకున్నంత పనిచేశారు. ముఖ్యంగా ప్రేరణ, విష్ణుప్రియ, పృథ్వీ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. ప్రేరణ, విష్ణుప్రియ జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక పృథ్వీ మాత్రం ఎప్పటిలాగే కన్నడ, ఇంగ్లీష్ లో బూతులతో రెచ్చిపోయాడు. అయితే టాస్క్ బ్రేక్ సమయంలో హౌస్ లో కొత్త రూల్ పెట్టాడు బిగ్‏బాస్ . ఇక నుంచి కిచెన్ లో ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్ లో ఒక్క సమయంలో ఒక్క టీమ్ మాత్రమే వంట చేయాలి. అలాగే టీమ్ వంట చేసేటప్పుడు ఆ టీంకు సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్ లో ఉండాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలోనే మీరు కూరగాయలు కోయడం కూడా లెక్కలోకి వస్తుందంటూ బిగ్‏బాస్ చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ షాకయ్యారు. కిచెన్ లో కొత్త రూల్ ఏంటీ అంటూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు.

ఇక కాంతార చీఫ్ అభయ్ మాత్రం బిగ్‏బాస్ నే తిట్టాడు. మనిషి పుట్టుక పుట్టారా లేదా అసలు ఈ రూల్స్ రాసినోళ్లు.. అంతమందికి ముగ్గురు ఎలా వండుతార్రా.. ధమాక్ లేదు మీకు.. తినడానికి టాస్కులు పెడుతున్నారా.. లేక తినకుండా ఉండేందుకు పెడుతున్నారా.. సైకోగాళ్లు.. పిచ్చి రూల్స్.. సైకోగాడు బిగ్‏బాస్ అంటూ రెచ్చిపోయాడు. అంతకు ముందు పెట్టిన మూవింగ్ ప్లాట్ ఫామ్ మీద టాస్కులో కాంతార టీమ్ ఎక్కువ పాయింట్స్ గెలిచింది. ఆ తర్వాత నబీల్ కు సారీ చెప్పింది విష్ణుప్రియ.

మొన్న నబీల్ తనను తాకరాని చోట తాకబోయాడంటూ చెప్పిన మాటను వెనక్కి తీసుకుంది విష్ణుప్రియ. ఇందాక గేమ్ లో నబీల్ టచ్ చేయలేదు.. బై మిస్టేక్ టచ్ చేస్తాడేమోనని నేను అలా అరిచాను.. కానీ తను అలా ఏం చేయలేదు.. ఐయామ్ సారీ నబీల్.. రాంగ్ వర్డ్స్ యూజ్ చేసినందుకు.. నిన్ను హర్ట్ చేయాలని నేను అలా అనలేదు.. నువ్వు చాలా మంచి అబ్బాయ్.. అంటూ సారీ చెప్పేసింది విష్ణు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.