Bigg Boss 8 Telugu: ఎలిమినేషన్‍లో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. కంటెస్టెంట్స్ సెలక్ట్ చేసినవారే బయటకు..?

|

Sep 15, 2024 | 5:21 PM

తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఎలిమినేషన్ కార్డ్ కంటెస్టెంట్స్ చేతిలో పెట్టేశారు. ఈ వారం ఎవరూ ఊహించని విధంగా శేఖర్ భాషాను ఇంటికి పంపించనున్నారు. ఇప్పటికే ఈ విషయం గత అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరలవుతుంది. నిజానికి అడియన్స్ ఓటింగ్ ప్రకారం శేఖర్ భాషా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు.

Bigg Boss 8 Telugu: ఎలిమినేషన్‍లో ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. కంటెస్టెంట్స్ సెలక్ట్ చేసినవారే బయటకు..?
Bigg Boss 8 Telugu
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 8 రెండవ వారం ఎలిమినేషన్ సమయం వచ్చేసింది. మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు వచ్చేయగా.. ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్లో ట్విస్ట్ ఉంటుందని చెప్పారు నాగార్జున. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ఎలిమినేషన్ కార్డ్ కంటెస్టెంట్స్ చేతిలో పెట్టేశారు. ఈ వారం ఎవరూ ఊహించని విధంగా శేఖర్ భాషాను ఇంటికి పంపించనున్నారు. ఇప్పటికే ఈ విషయం గత అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరలవుతుంది. నిజానికి అడియన్స్ ఓటింగ్ ప్రకారం శేఖర్ భాషా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. కానీ ఈసారీ ఎవరూ ఊహించని విధంగా శేఖర్ బాషాను ఎలిమినేషన్ చేసేందుకు రెడీ అయ్యారు. అందుకు కారణం కూడా ఉందని తెలుస్తోంది.

తాజాగా విడుదలైన ప్రోమోలో బిగ్ ట్విస్ట్ ఇప్పుడు రాబోతుందని చెప్పారు. బాటమ్ 2 వరకు అడియన్స్ సెలక్ట్ చేసిన వాళ్లే ఉన్నారు. కానీ ఈ సీజన్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ అదే.. ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న ఆ ఇద్దరిలో ఇంట్లో ఎవరుంటారు.. ఇంటి బయటకు ఎవరు వస్తారనేది ఈసారి హౌస్మేట్స్ డిసైడ్ చేయబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు నాగ్. అంటే ఈవారం ఎలిమినేట్ చేసేంది అడియన్స్ కాదు.. హౌస్మేట్స్ అన్నమాట. ఎవరు ఎలిమినేట్ కావాలి.. ఎవరు సేవ్ కావాలనేది కంటెస్టెంట్స్ ఓట్లు వేస్తారు. ఇక శేఖర్ భాషాకు ఇటీవలే బాబు జన్మించిన సంగతి తెలిసిందే. ఇదే కారణంతో శేఖర్ భాషాను పంపించనున్నారు.

కానీ అడియన్స్ ఓటింగ్ ప్రకారం ఇప్పటివరకు అత్యంత తక్కువ ఓటింగ్ వచ్చిన కంటెస్టెంట్ పృథ్వీ. నిజానికి రెండవ వారం పృథ్వీ ఎలిమినేట్ అవుతాడనే అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో శేఖర్ భాషాను పంపించనున్నారు. పృథ్వీ తర్వాత ఆదిత్య ఓంకు ఓటింగ్ తక్కువే వచ్చింది. ఆదిత్య పైన కిరాక్ సీత ఉండగా.. పృథ్వీ, సీత, ఆదిత్య కంటే ఎక్కువ ఓట్లు శేఖర్ భాషాకు వచ్చాయి. కానీ ఈవారం ఊహించని విధంగా శేఖర్ భాషా ఇష్టపూర్వకంగా ఎలిమినేషన్ జరుగుతుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.