Bigg Boss 8 Telugu: వార్నీ.. ఇదేక్కడి టాస్క్ బిగ్‏బాస్.. బాధతో అల్లాడిన ఆ ముగ్గురు.. యష్మీ ఫైర్..

|

Sep 12, 2024 | 3:13 PM

తాజాగా ఈరోజు జరిగిన టాస్కులలో అదరగొట్టేసింది. రోప్ టాస్కులో పృథ్వీకి గట్టి పోటీనిచ్చి గెలిచాడు నిఖిల్. ఇక ఆ త్రవాత స్పెల్లింగ్ టాస్కులో యష్మీ, నైనికలను మణికంఠ ఓడించాడు. దీంతో నిఖిల్ టీమ్ ప్రైజ్ మనీ ఏకంగా లక్ష 20 వేలకు పెరిగింది. ఆ తర్వాత నైనిక టీమ్ రూ.50వేలు గెలుచుకుంది.

Bigg Boss 8 Telugu: వార్నీ.. ఇదేక్కడి టాస్క్ బిగ్‏బాస్.. బాధతో అల్లాడిన ఆ ముగ్గురు.. యష్మీ ఫైర్..
Bigg Boss 8 Telugu Promo
Follow us on

గత రెండు రోజులుగా బిగ్‏బాస్ హౌస్‏లో వరుస పెట్టి టాస్కులు జరుగుతున్నాయి. మూడు టీమ్స్ సభ్యులు నువ్వా, నేనా అన్న రేంజ్ లో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఇక టాస్కులలో ఓడిపోయి ఈ వారం మొత్తం రాగిపిండికే పరిమితమైన నిఖిల్ టీమ్.. తాజాగా ఈరోజు జరిగిన టాస్కులలో అదరగొట్టేసింది. రోప్ టాస్కులో పృథ్వీకి గట్టి పోటీనిచ్చి గెలిచాడు నిఖిల్. ఇక ఆ త్రవాత స్పెల్లింగ్ టాస్కులో యష్మీ, నైనికలను మణికంఠ ఓడించాడు. దీంతో నిఖిల్ టీమ్ ప్రైజ్ మనీ ఏకంగా లక్ష 20 వేలకు పెరిగింది. ఆ తర్వాత నైనిక టీమ్ రూ.50వేలు గెలుచుకుంది.

తాజాగా విడుదలైన ప్రోమోలో.. కంటెస్టెంట్లకు వ్యాక్స్ చేసుకోవాలంటూ టాస్కు పెట్టాడు బిగ్‏బాస్. వ్యాక్స్ టాస్క్ (బాడీపై వెంట్రుకలు తొలగించడం)లో పృథ్వీ, నిఖిల్, నబీల్ పోటీపడ్డారు. కానీ ఆట మధ్యలోనే నొప్పిని తట్టుకోలేక పృథ్వీ టాస్క్ నుంచి తప్పుకున్నట్లు ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇక నిఖిల్, నబీల్ మాత్రం గట్టిగానే పోటీపడ్డారు. ఇక ఈటాస్క్ అనంతరం మరోసారి ఇంట్లో గొడవ స్టార్ట్ చేసింది యష్మీ.

డస్ట్ బిన్ నుంచి పాలు ప్యాకెట్ కవర్ తీసి.. ఇది ఎవరూ తీశారంటూ సీతను అడిగింది. నాకు తెలీదు.. విష్ణు తీసిందంటూ సీత చెప్పడంతో విష్ణుతో గొడవకు దిగింది యష్మీ. మా పాల ప్యాకెట్ ఎందుకు తీశావంటూ ప్రశ్నించగా.. మీరు మా చికెన్ కొట్టేయలేదా అని విష్ణు అడగ్గా.. నువ్వు చూశావా.. ప్రూఫ్ ఉందా అంటూ అడ్డదిడ్డంగా వాదించింది. నిజానికి నైనిక టీం గెలిచిన రేషన్ మొత్తాన్ని కొట్టేయాలని తన టీమ్ సభ్యులకు చెప్పింది యష్మీ. ఆ తర్వాత ప్రేరణతో కలిసి నైనిక టీం గెలిచిన చికెన్ కూడా గెలిచింది.

ఇవి కూడా చదవండి

బిగ్‏బాస్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.4