బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే సందడి సందడిగా జరుగుతోంది. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్..అలాగే ప్రస్తుతం గ్రాండ్ ఫినాలేలో ఉన్న కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఈ ఫినాలే ఎపిసోడ్ కు హాజరయ్యారు. అలాగే మధ్యలో పలువురు సినీ ప్రముఖులు కూడా సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికాసేపట్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతను ప్రకటించనుండగా.. విన్నర్ ఎవరనే లీక్ బయటకు వచ్చేసింది. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా అవతరించాడని తెలుస్తోంది. తెలుగబ్బాయి గౌతమ్ కృష్ణ కేవలం రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకున్నాడని సమాచారం. నిఖిల్ టైటిల్ గెలవడంతో రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. లగ్జరీ కారుని సొంతం చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.మరి కాసేపట్లో రామ్ చరణ్ చేతుల మీదుగా అధికారికంగా విజేతను ప్రకటించనున్నారు.
ఈ సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు నిఖిల్. మొదటి నుంచి తన ఆట, మాటతీరుతో అందరి మనసులు గెల్చుకుంటున్నాడు. ఇక ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు. దీంతో టాప్ -2లోకి వచ్చాడు. ఇక గౌతమ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్ లో ఎదురైన చేదు అనుభవాలను చక్కదిద్దుకుంటూ చక్కటి ఆటతీరు ప్రదర్శించాడు. ఇప్పుడు ఏకంగా టైటిల్ ఫేవరేట్లలో ఒకడిగా నిలిచాడు.
And it’s confirmed 💥💥
NIKHIL MALIYAKKAL BB-Telugu 8
Winner 🏆🏆🏆#Nikhilmalayakkal 👏🏻🔥🔥 pic.twitter.com/b7spdRMn93— Seetha Ramaraju❤️🔥 (@Nani_DHFM77) December 15, 2024
When Global Star @AlwaysRamCharan walks in, the stage lights up! Don’t miss his epic presence at the Bigg Boss Telugu 8 Grand Finale ! #BiggBossTelugu8GrandFinale #BiggBossTelugu8 #StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/0MQif6fRWh
— Starmaa (@StarMaa) December 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.