Bigg Boss 7 Telugu: ‘అందరిని నమ్మకు.. రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు’.. శివాజీకి కొడుకు సలహా..

|

Nov 08, 2023 | 8:59 AM

శివాజీ రాగానే హార్ట్ కైసే హే అంటూ అడిగారు. బాగుందని శివాజీ చెప్పడంతో ఎక్సర్ సైజులు చేస్తున్నారా.. బాగా పడుకుంటున్నారా ? అని డాక్టర్ అడిగాడు. ఇక చేయి పైకి ఎత్తితో పెయిన్ ఉందంటూ శివాజీ చెప్పడంతో రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ చెప్పడంతో థాంక్యూ సార్ అంటూ శివాజీ బయటకు వెళ్లబోయాడు. ఇంతలో నాన్న అంటూ చిన్నగా పిలిచాడు. వెంటనే వెనక్కి తిరిగిన శివాజీ ఏంటీ అంటూ అని అడిగాడు. దీంతో వెంటనే మాస్క్, స్పెట్స్, హెడ్ క్యాప్ తీయడంతో కొడుకును షాక్ లో

Bigg Boss 7 Telugu: అందరిని నమ్మకు.. రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు.. శివాజీకి కొడుకు సలహా..
Shivaji
Follow us on

ఇప్పటివరకు జరిగిన అన్ని ఎపిసోడ్లలో ప్రతి ప్రేక్షకుడి హృదయాలను తాకిన ఎపిసోడ్ ఇదే. ఫ్యామిలీ వీక్ మొదటి రోజు వెరీ ఎమోషనల్‏గా సాగింది. ముందుగా డాక్టర్ గా శివాజీ పెద్ద కొడుకు కెన్నీ హౌస్ లోకి అడుగుపెట్టాడు. శివాజీని మెడికల్ రూంకు రమ్మని పిలిచాడు బిగ్‏బాస్. అక్కడ ముఖానికి మాస్కు.. హెడ్ క్యాప్, స్పెట్స్, కోటు అన్నీ వేసుకొని ఒక డాక్టర్ ఉన్నారు. శివాజీ రాగానే హార్ట్ కైసే హే అంటూ అడిగారు. బాగుందని శివాజీ చెప్పడంతో ఎక్సర్ సైజులు చేస్తున్నారా.. బాగా పడుకుంటున్నారా ? అని డాక్టర్ అడిగాడు. ఇక చేయి పైకి ఎత్తితో పెయిన్ ఉందంటూ శివాజీ చెప్పడంతో రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్ చెప్పడంతో థాంక్యూ సార్ అంటూ శివాజీ బయటకు వెళ్లబోయాడు. ఇంతలో నాన్న అంటూ చిన్నగా పిలిచాడు. వెంటనే వెనక్కి తిరిగిన శివాజీ ఏంటీ అంటూ అని అడిగాడు. దీంతో వెంటనే మాస్క్, స్పెట్స్, హెడ్ క్యాప్ తీయడంతో కొడుకును షాక్ లో ఉండిపోయాడు శివాజీ. వెంటనే తండ్రిని గట్టిగా హగ్ చేసుకోవడంతో ఎమోషనల్ అయిపోయాడు శివాజీ. ఏడవకు నాన్న వద్దు నాన్న ఏడవకు.. హెల్త్ బాలేనప్పుడు ఏడవకు.. అంటూ తన కొడుకు చెప్పడంతో శివాజీ ముద్దు పెట్టి తెగ మురిసిపోయాడు. భయమేసింది నాన్న మీ చేయి ఇలా అయినప్పుడు అంటూ కొడుకు చెప్పగా.. ఇప్పుడు బానే ఉంది.. సీటు ఎక్కడొచ్చింది అని అడిగ్గా.. యూఏబీ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి ఇంటి సభ్యులకు పరిచయం చేశాడు.

ఆ తర్వాత కొడుకుతో మాట్లాడుతూ మళ్లీ ఎమోషనల్ అయ్యాడు శివాజీ. దీంతో నువ్వు ఏడవకు.. నువ్వు ఏడిస్తే అందరూ ఏడుస్తారు.. నువ్వు నవ్వితే ఇంట్లో అందరూ నవ్వుతారు అని చెప్పడంతో కంట్రోల్ చేసుకున్నాడు శివాజీ. నువ్వు ఏ విషయమైనా మనసులో పెట్టుకోకు.. అనుకోలేదు అసలు ఎవరూ నువ్వు ఇన్ని రోజులు ఉంటావని అంటూ చెప్పాడు. ఇక ఆ తర్వాత తండ్రిని బాగా చూసుకున్నందుకు యావర్, ప్రశాంత్ కు థాంక్స్ చెప్పాడు శివాజీ కొడుకు. ఆ తర్వాత వెళ్లేముందు శివాజీకి సీక్రెట్ సలహా ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఒక్కటేంటంటే.. అందరినీ నమ్మకు హౌస్ లో.. యావర్, ప్రశాంత్ గురించి కాదు.. మిగిలినవాళ్లు. నిన్ను ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు అంటూ చెప్పడంతో శివాజీ రియాక్ట్ అవుతూ.. అవన్నీ వదిలెయ్.. ఇన్నాళ్లు నేను మీరు చెబితే ఆడానా అలాగే నేన బయటకు వచ్చేటప్పుడు జనం క్లాప్స్ కొడతారు అది చాలు నాకు అంటూ లైట్ తీసుకున్నాడు శివాజీ.