బిగ్బాస్ సీజన్ 7 ఊహించని ట్విస్టులతో అంతా ఉల్టా పుల్టాగా ఉండబోతుంది. ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్లకు భిన్నంగా సీజన్ 7 ఉండబోతుందని ముందు నుంచి నాగార్జున చెబుతూ వచ్చారు. దీంతో ఈసారి షోపై మరింత ఆసక్తి పెరిగింది. ముందు కేవలం 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తే.. అందులో నలుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకిలా.. మూడవ వారం సింగర్ దామిని ఇంటిబాట పట్టగా.. టైటిల్ ఫేవరెట్ అంటూ హౌస్ లోకి అడుగుపెట్టిన రతిక… నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది. దీంతో ఇప్పుడు హౌస్ లో ముగ్గురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఆ ముగ్గురిలోనూ ఈవారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ లెక్క ప్రకారం ఐదోవారం బిగ్బాస్ హౌస్ నుంచి సీరియల్ హీరోయిన్ ప్రియాంక ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక అదే జరిగితే ఇంట్లో కేవలం ఇద్దరు అమ్మాయిలు మాత్రమే ఉండనున్నారు. అయితే ఉల్టా పుల్టా.. మీరు ఊహించనివి ఎన్నో జరగబోతున్నాయంటూ ముందునుంచి చెప్పుకొస్తున్న నాగ్.. ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ వీకెండ్ శని, ఆదివారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మీరు ఊహించనివి ఈ వారం చాలా జరుగుతాయంటూ నాగార్జున గతవారం హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వారం ఆట తీరు మారబోతుందని కంటెస్టెంట్స్ ను హింట్ ఇచ్చారు బిగ్బాస్. ఇక ఈ ఆదివారం బిగ్బాస్ 2.0 గ్రాండ్ లాంఛ్ కాబోతుంది. సీజన్ 7 లాంఛింగ్ జరిగినట్లుగానే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీల లాంఛ్ ఈవెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే సీరియల్ హీరో అర్జున్ అంబాటి, అంజలి పవన్, సింగర్ భోలే షావలి, పూజా మూర్తి ఈవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టబోతున్నారట.
ఇక వీరే కాకుండా.. ఇప్పటికే ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సింగర్ దామిని, రతిక రోజ్ మరోసారి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. వీరితో ఇప్పటికే బిగ్బాస్ మేకర్స్ సంప్రదింపులు జరిపారని… త్వరలోనే వీరు మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా రీఎంట్రీ విషయంలో మాత్రం రతిక పేరు ఎక్కువగానే వినిపిస్తోంది. ఇంట్లో ఉన్నప్పుడు ఆమెపై విపరీతమైన నెగిటివిటీ పెరగడంతో ఆమెను ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిచింది. రతిక ఎలిమినేట్ అంటూ ట్విట్టర్ వేదికగా హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. ఇక ఇప్పుడు రతికను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తిరిగి హౌస్ లోకి పంపాలంటూ నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అడియన్స్ కోరిక మేరకు మరోసారి రతికను రీఎంట్రీ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఈ వారం అటు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. రీఎంట్రీలతో బిగ్బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టాగా సాగనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.