Bigg Boss 7 Telugu : మీ సమంత ఎక్కడా ?.. విజయ్ దేవరకొండకు నాగ్ ప్రశ్న.. బిగ్బాస్ ప్రోమో గమనించారా..
తాజాగా బిగ్బాస్ ప్రోమో రిలీజ్ చేశారు. 2.11 నిమిషాల నిడివితో ఉన్న ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ ముఖాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఈ షోకు అతిథులుగా విజయ్ దేవరకొండ, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి వచ్చి సందడి చేశారు. వీరిద్దరు తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ షోకు వచ్చారు. ముందుగా ఆరాధ్య ఆరాధ్య.. నువ్వే లేనేదేదీ వద్దూ పాటకు ఎంట్రీ ఇచ్చారు విజయ్. అనంతరం విజయ్ కు వెల్ కమ్ చెప్పిన నాగ్
బుల్లితెరపై అసలైన సందడి షూరు కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి.. ఈసారి అంతా ఉల్టా పుల్టా అంటూ చెప్పుకొస్తున్న నాగ్.. సీజన్ 7లో ఏం చేయబోతున్నారు.. ఎలాంటి ఛాలెంజెస్ ఇవ్వబోతున్నారు అనే క్యూరియాసిటి ఇప్పుడు అందరిలో నెలకొంది. ముఖ్యంగా సీజన్ 7 కంటెస్టెంట్స్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని సీజన్లకు భిన్నంగా.. సరికొత్తగా ఈసారి షో ఉండబోతుందని ప్రోమోస్ ద్వారా ఆసక్తిని పెంచారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. శనివారం బిగ్బాస్ హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ వెళ్లగా.. ఆదివారం ఉదయం మరికొంత మంది హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు. అయితే ఈసారి బిగ్బాస్ హౌస్ రూపురేఖలు మార్చేసినట్లుగా తాజాగా విడుదలైన ప్రోమోస్ చూస్తుంటే తెలుస్తోంది. అంతేకాకుండా..మొదటి రోజు నుంచి సీక్రెట్ రూంలో ఓ కంటెస్టెంట్ ఉండనున్నారని టాక్.
ఇదిలా ఉంటే తాజాగా బిగ్బాస్ ప్రోమో రిలీజ్ చేశారు. 2.11 నిమిషాల నిడివితో ఉన్న ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ ముఖాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఈ షోకు అతిథులుగా విజయ్ దేవరకొండ, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి వచ్చి సందడి చేశారు. వీరిద్దరు తమ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ షోకు వచ్చారు. ముందుగా ఆరాధ్య ఆరాధ్య.. నువ్వే లేనేదేదీ వద్దూ పాటకు ఎంట్రీ ఇచ్చారు విజయ్. అనంతరం విజయ్ కు వెల్ కమ్ చెప్పిన నాగ్..” ఏమీ మీ హీరోయిన్ ఏది సమంత ?” అంటూ అడిగేశారు. ఇక విజయ్ నవ్వుతూ ఉండిపోయారు.
View this post on Instagram
ఆ తర్వాత వచ్చిన నవీన్ పొలిశెట్టి రావడంతో తన స్టైల్లో కామెడీతో నవ్వించారు. జాతిరత్నాలు సినిమాలో చెప్పిన “రాయల్ విల్లాస్ అన్నపూర్ణ స్టూడియోస్ పక్కనే ” అంటూ డైలాగ్ గుర్తుచేస్తూ.. ఈరోజు నిజంగానే అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నామంటూ చెప్పారు. ఇక అన్ని సీజన్స్ మాదిరిగా చివర్లో కాకుండా మొదటి రోజు కంటెస్టెంట్స్ పొట్టు పొట్టు కొట్టుకునే విధంగా చేశారు నాగ్. సూట్ కేస్ లో డబ్బులు తీసుకుని ఇప్పుడే హౌస్ నుంచి వెళ్లిపోవచ్చని నాగ్ చెప్పారు.మరీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే. చివరగా మీరు ఎంతైనా ఊహించుకోండి.. కానీ మీ ఊహకు అందని సీజన్ బిగ్బాస్ సీజన్ 7.. బట్ కంటెస్టెంట్స్ కు మాత్రం నాట్ హెవెన్ అంటూ ముగించారు. మొత్తానికి ఈసారి కంటెస్టెంట్స్ కు ఎక్కువగానే చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యాడు బిగ్బాస్ .
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.