బిగ్‌బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి ఐదు వారాలు గడిచిపోయింది. మొత్తం పద్నాలుగు మందితో మొదలైన ఈ గేమ్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక, శుభ శ్రీ ఎలిమినేట్ కాగా.. గత ఆదివారం ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అడుగుపెట్టారు. అర్జున్ అంబటి, అశ్విని, సింగర్ భోలే, నయని పావని, పూజా మూర్తి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లు సీక్రెట్ రూంలో ఉన్న గౌతమ్ రీఎంట్రీ ఇచ్చాడు. హౌస్ లోకి రిటర్న్ వస్తూ గౌతమ్ ఇచ్చిన పర్ఫామెన్స్ మాములుగా లేదు. భారీ భారీ డైలాగ్‌లతో ఓ రేంజ్లో ఎంట్రీ ఇచ్చి.. బీబీ 2.0 అంటూ ఓవరాక్షన్ డైలాగ్స్ చెప్పాడు. ఇదిలా ఉంటే.. ఇక ఆరోవారం హౌస్ లో అమర్ దీప్, యావర్, సందీప్, తేజా, శోభా, నయని, అశ్విని, పూజా మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన గౌతమ్ సందీప్ ను సేవ్ చేశాడు.
ఇక ఇప్పుడు మరో ప్రోమో రిలీజ్ చేశారు. ఎప్పుడూ సీరియస్‌గా టాస్కులు ఇచ్చే బిగ్‌బాస్ ఈసారి మాత్రం కంటెస్టెంట్ తెలివితేటలపై జోక్స్ వేస్తూ నవ్వులు తెప్పించారు. ముందుగా ఆటగాళ్లు.. పోటుగాళ్ల టీమ్ లలో ఎవరు బెస్ట్ అనేది తెలుసుకోవడానికి స్విమ్మింగ్ ఫూల్ టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్ . అర్జున్.. గౌతమ్, యావర్.. సందీప్ టీమ్స్ గా ఆడారు. ఇక ఆ తర్వాత ఆటుగాళ్లు, పోటుగాళ్ల టీంలో ఎవరు జీనియస్ అనేది తెలుసుకోవడానికి జనరల్ క్వశ్చన్స్ అడిగారు. కొన్ని ఫోటోస్ చూపిస్తూ అందుకు సంబంధించిన ప్రశ్నలు అడగ్గా.. ముందుగా అమర్ దీప్, గౌతమ్ గేమ్ ఆడారు. గన్ పేల్చాక చెట్టుపై ఎన్ని పక్షులు ఉంటాయని బిగ్‌బాస్ అడగ్గా.. ఒక్కటి కూడా ఉండవని ఆన్సర్ ఇచ్చాడు అమర్ దీప్.. దీంతో మధ్యలో పూజా కల్పించుకుని శివాజీ చెప్తేనే చెప్పాడంటూ కౌంటరిచ్చింది.
ఆ తర్వాత ఓ కేక్ పిక్ చూపిస్తూ.. ఆ కేక్ లో 800 వందల క్యాలరీస్ ఉన్నాయి. దానిని రెండు ముక్కలు చేస్తే ఎన్ని క్యాలరీస్ ఉంటాయని అడగ్గా.. వెంటనే అమర్ దీప్ ప్రశ్న అర్థమైందా ?అంటూ ప్రశ్నించాడు. 800 క్యాలరీస్ కరెక్ట్ కాదేమో అని అమర్ దీప్ చెప్పగా.. కేక్ కట్ చేశారు తినలేదు అంటూ సెటైర్ వేశాడు బిగ్‌బాస్ . ఇక ఆ తర్వాత టేస్టీ తేజ, గౌతమ్ అడగా.. మరోసారి తన స్టైల్లో తేజపై పంచులు వేశాడు బిగ్‌బాస్. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్లో ఫన్నీ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.