AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6- Nagarjuna: బిగ్‏బాస్‏కు షాకిచ్చిన నాగార్జున.. ఆ కారణంతోనే షోకు గుడ్ బై చెప్పేసాడా ? .. ఆ వార్తల్లో నిజమెంత ?..

ఇక ఎట్టకేలకు ఇప్పుడు ముగింపుకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో సీజన్ 6 విజేత ఎవరనేది తెలియనుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ కు హోస్ట్ నాగార్జున షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Bigg Boss 6- Nagarjuna: బిగ్‏బాస్‏కు షాకిచ్చిన నాగార్జున.. ఆ కారణంతోనే షోకు గుడ్ బై చెప్పేసాడా ? .. ఆ వార్తల్లో నిజమెంత ?..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2022 | 7:12 PM

Share

బిగ్ బాస్ సీజన్ 6.. అట్టర్ ప్లాప్ అనడంలో సందేహం లేదు. గత సీజన్లకు దారుణంగా ఈ సీజన్ టీఆర్పీ రేటింగ్ నమోదుచేసుకుంటుంది. అంతేకాకుండా.. మొదటి వారం నుంచే ఈ షో పై ప్రేక్షకులు అసంతృప్తిగా ఉన్నారు. కంటెస్టెంట్స్ ఎంపిక.. ఆట తీరు ఆడియన్స్ కు నచ్చకపోవడమే.. బిగ్ బాస్ నిర్ణయాలు.. ఎలిమినేషన్ పై కూడా విమర్శలు వెల్లువెత్తా యి. ఇక ఈ షోలో ఎప్పుడు ఏం జరుగుతుంది.. ఎటు వైపు వెళ్తుందో కూడా అర్థం కావడం లేదనేది ప్రధాన వాదన. ముఖ్యంగా ఇనయ ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ షోపై మరింత నెగిటివిటి పెరిగింది. ఫైనల్ లో ఉండాల్సిన తనను.. ఓటింగ్ కు విరుద్దంగా బయటకు పంపించారని…గేమ్ ఆడకుండా సోది కబుర్లు చెబుతున్నవారిని ఇంట్లో ఉంచుతున్నారంటూ విమర్శలు వచ్చాయి. హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్. అయితే ఇవేం పట్టించుకోకుండా.. బిగ్ బాస్ షోను ఫైనల్ వరకు తీసుకొచ్చారు నిర్వాహకులు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు ముగింపుకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో సీజన్ 6 విజేత ఎవరనేది తెలియనుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ కు హోస్ట్ నాగార్జున షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం.. ఈ షోకు హోస్ట్ నాగార్జున గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇకపై ఈషోకు వ్యాఖ్యతగా వ్యవహరించబోనని తేల్చి చెప్పాడంటూ ఓ వార్త నెట్టింట వైరలవుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఇనయ ఎలిమినేషన్ అని టాక్. ఇనయ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ తో బిగ్ బాస్ షోపై.. నిర్వాహకులపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక ఇదే కారణంతోనే హోస్ట్ నాగ్ కూడా తప్పుకున్నట్లుగా సమాచారం. అలాగే వచ్చే సీజన్ కు రౌడీ హీరో విజయ్ వ్యాఖ్యతగా ఉండనున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఇక 21 మందితో మొదలైన ఈ సీజన్ చివరకు 5గురు మిగిలారు. మొన్నటి వరకు ఆరుగురు ఉండగా.. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ శ్రీసత్యను ఇంటి నుంచి పంపించేశారు. ఇక చివరగా.. కీర్తి, శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్ ఫైనలిస్టులుగా నిలిచారు. అయితే ఎలిమినేట్ అయిన శ్రీసత్య ఇప్పటివరకు బయటకు రాలేదు. ఇక రేపు ఆదివారం సాయంత్రం విన్నర్ ఎవరనేది తెలియనుంది.