Bigg Boss 6 Telugu: రూ. 5 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్న శ్రీహాన్.. బిగ్ బాస్ ఇంట్లో మాజీ కంటెస్టెంట్స్ సందడి..

|

Dec 18, 2022 | 1:32 PM

ఇందులో కీర్తి.. శ్రీహాన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అని అడగ్గా.. ఆదిరెడ్డి ఠక్కున ఇయన పేరు చెప్పడంతో అక్కడున్నవారంత నవ్వేశారు. తర్వాత.. అవినాష్.. అరియానా వచ్చి డ్యాన్స్ చేసి అలరించారు. ముఖ్యంగా అవినాష్.. పంచులు.. కామెడీ తెగ నవ్వించేశారు.

Bigg Boss 6 Telugu: రూ. 5 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్న శ్రీహాన్.. బిగ్ బాస్ ఇంట్లో మాజీ కంటెస్టెంట్స్ సందడి..
Srihan
Follow us on

బిగ్ బాస్ సీజన్ 6 మరికాసేపట్లో శుభం కార్డ్ పడనుంది. ఈరోజు సాయంత్రం సీజన్ 6 విన్నర్ ఎవరనేది తెలయనుంది. ఇప్పటికే విజేత ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక మరోవైపు బిగ్ బాస్ ఇంట్లో ఫైనల్ సంబరాలు షూరు అయ్యాయి. మాజీ కంటెస్టెంట్స్ హౌస్ లో సందడి చేశారు. ముందుగా రో ల్ రైడా ఇంట్లోకి అడుగుపెట్టి.. బీబీ జోడీ షో రాబోతుదంటూ చెప్పుకొచ్చాడు. అది కంటెస్టెంట్లు జంటలుగా పాల్గోనే రియాల్టీ డ్యాన్స్ షో అని తెలిపాడు. ఇక ఆ తర్వాత మెహబాబు, అషూ జంటగా వచ్చి ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్స్ ఆడించారు. ఇందులో కీర్తి.. శ్రీహాన్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ? అని అడగ్గా.. ఆదిరెడ్డి ఠక్కున ఇయన పేరు చెప్పడంతో అక్కడున్నవారంత నవ్వేశారు. తర్వాత.. అవినాష్.. అరియానా వచ్చి డ్యాన్స్ చేసి అలరించారు. ముఖ్యంగా అవినాష్.. పంచులు.. కామెడీ తెగ నవ్వించేశారు.

తర్వాత చైతూ.. కాజల్ వచ్చి ఒక్కో ఇంటిసభ్యుడి గురించి చెప్పుకొచ్చారు. శ్రీహాన్ ఎంటర్టైన్మెంట్.. రేవంత్ అంటే కోపమని.. రోహిత్ కామ్ అండ్ కంపోడ్జే , ఆదిరెడ్డి.. కాన్ఫిడెంట్, కీర్తి గేమ్ బాగా ఆడుతుందని చెప్పుకొచ్చాడు చైతూ. తర్వాత కొన్ని టాస్కులు ఇవ్వగా… అందులో కీర్తి గెలిచి ఫ్రైడ్ చికెన్ సంపాదించుకుంది. ఇక తర్వాత రవి..భాను వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలో నే శ్రీహాన్ జెన్యూన్ కాదు.. డ్రామా చేస్తున్నాడనుకున్నానని.. సారి చెప్పినప్పుడు కూడా నిజమని నమ్మలేదని.. కానీ తర్వాత అభిప్రాయం మారిందని చెప్పుకొచ్చింది కీర్తి.

ఇక కొన్ని వారాలుగా ఆన్ లైన్ లో లెన్స్ కార్డ్ స్టైలిష్ కంటెస్టెంట్ పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీహాన్ గెలిచి.. సైలీష్ కంటెస్టెంట్ ఆఫ్ ది సీజన్ గా నిలిచారు. అంతేకాకుండా.. రూ. 5 లక్షలు గెలుచుకున్నాడు. ఇక మరికాసేపట్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఈ సీజన్ విన్నర్ ఎవరనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అయితే నెట్టింట మాత్రం విజేత రేవంత్ అని ప్రచారం జరుగుతుంది.

ఇవి కూడా చదవండి