యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి .. ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‌గా మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది నేహా చౌదరీ. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఆమె రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి ఛాంపియన్ సాధించింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం పలు ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది నేహ. ఇక తాజాగా తను పెళ్లి చేసుకోబోతున్నట్లు స్వయంగా వెల్లడించింది. అంతేకాకుండా తనకు కాబోయే భర్త వివరాలు రివీల్ చేసింది. తన సొంత యూట్యూబ్ ఛానల్ లో నా పెళ్లి గోల మొదలైందంటూ ప్రత్యేకంగా ఓ వీడియో షేర్ చేసింది నేహ.
ఇంజినీరింగ్‌లో తన క్లాస్ మేట్ అయిన అనిల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చింది. దాదాపు 13 ఏళ్ల నుంచి తామిద్దరం స్నేహితులమని.. అతను ఆరు అడుగుల ఎత్తు ఉంటాడని తెలిపింది. ఇక నేహాకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతంలో బీబీ హౌస్ లోకి వెళ్లేముందు నాగార్జునతో.. బిగ్ బాస్ కు వెళ్లొచ్ఛాక పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
అయితే యాంకర్ కాకముందు నేహా క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది. తిరుపతికి చెందిన నేహ.. జిమ్నాస్టిక్స్ లో నేషనల్ ఛాంపియన్ మాత్రమే కాకుండా.. యాంకర్ గా పలు షోలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.