బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు..కప్పు మిగులు బిగులూ అంటూ బిగ్‌బాస్ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ముందు నుంచి నెగిటివిటిని ముటగట్టుకున్న సన్నీ చివరకు సీజన్ 5 విన్నర్ అయ్యాడు. తన తల్లి అడిగిన మొదటి బహుమతిని అందించడం కోసం వీజే సన్నీ ఎక్కువగానే కష్టపడ్డాడు అనడంలో సందేహం లేదు. టాస్కులలో ఆగ్రెసివ్ కావడం వలన ఎన్నోసార్లు.. ఇంటిసభ్యులతో.. నాగార్జునతో క్లాస్ తీసుకున్నాడు సన్నీ. మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ 5 కప్పు గెలిచాడు ఖమ్మం కుర్రాడు.
ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే అనంతరం అరియానా గ్లోరితో బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు సన్నీ. ఈ సందర్భంగా.. హౌస్మేట్స్ గురించి.. తన జర్ని గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్ అనేది వేరే ప్రపంచమని చెప్పాడు సన్నీ. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు చేయని తప్పుకు రెండుమూడుసార్లు నింద పడ్డాను.. కానీ ఆ బాధతో వెనక్కి తగ్గకుండా టాస్కుల్లో మరింత గట్టిగా ఫైట్ చేశాను. బేటన్ టాస్కులో చాలా కష్టపడ్డాను.. కానీ అదే టాస్కుకు అందరూ నన్ను వరస్ట్ పర్ఫామర్ గా ఎన్నుకున్నారు. ఇతర సభ్యులు కాకుండా నా టీం మెంబర్స్ నన్ను వరస్ట్ పర్ఫామర్ అనేసరికి బాధపడ్డాను అని చెప్పుకొచ్చాడు సన్నీ.
అలాగే కెప్టెన్సీ కోసం పోటీ చేస్తున్న సమయంలో అందరూ తనను చిన్న చిన్న రీజన్స్ చెప్పి కత్తితో పొడిచేశారని.. ఆ సమయంలో చాలా బాధపడ్డాను.. ఎందుకో తెలియదు ఇంట్లో వాళ్లకు నచ్చలేదు. ఇక శ్రీరామ్ నామినేషన్స్ సమయంలో ఒక మాదిరిగా ఉంటాడు.. సాధారణ సమయంలో కూల్ గా ఉంటాడు.. అలాగే నటరాజ్ మాస్టర్ సింహం అని చెప్పుకొచ్చాడు సన్నీ. పింకీలాంటి అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టుండాలని.. చాలా మంచిదని. తన ముందు ఎవరైనా బాధపడితే చూడలేదని.. ముందు అందరికి అన్నం పెడుతుందని చెప్పాడు సన్నీ. కాజల్ మొదట్లో నచ్చేది కాదని.. కానీ ఆ తర్వాత చాలా మంచి ఫ్రెండ్ అయ్యిందని చెప్పుకొచ్చాడు. ఇక షన్ముఖ్, సిరి ఫ్రెండ్ షిప్ బాగుంటుందని.. వారిద్దరూ ఒకరిపై ఒకరు కేర్ తీసుకునేవారని చెప్పుకొచ్చాడు. అలాగే మానస్.. తను కుక్క పిల్లల మాదిరిగా కొట్టుకుంటామని చెప్పాడు. ఇక మొదట్లో జెస్సీని అందరూ టార్గెట్ చేశారని.. కానీ అతను చిన్నపిల్లోడని అన్నాడు సన్నీ. కాజల్ టాప్ 3లో ఉంటుందని అనుకున్నాను.. కానీ అది జరగలేదు అని చెప్పుకొచ్చాడు సన్నీ.
Samantha: ఇలా కనిపించాలంటే మాత్రం హార్డ్‌వర్క్ కంపల్సరీ.. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన సమంత..