Rashmi Gautam: ఆస్పత్రి బెడ్‌పై జబర్దస్త్ యాంకర్ రష్మీ.. షాక్‌లో ఫ్యాన్స్.. ఏమైందంటే?

ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ ఆస్పత్రి పాలైంది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిందీ అందాల యాంకరమ్మ. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు రష్మీ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Rashmi Gautam: ఆస్పత్రి బెడ్‌పై జబర్దస్త్ యాంకర్ రష్మీ.. షాక్‌లో ఫ్యాన్స్.. ఏమైందంటే?
Rashmi Gautam

Updated on: Feb 11, 2025 | 3:52 PM

స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆమె ఆ తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ లాంటి ఫేమస్ టీవీ షోస్ లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. మధ్యమధ్యలో సినిమాలు కూడా చేస్తూ వస్తోంది. గుంటూరు టాకీస్‌, బొమ్మ బ్లాక్‌బస్టర్‌, నెక్స్ట్‌ నువ్వే, అంతకుమించి తదితర చిత్రాల్లో రష్మీ హీరోయిన్ గా చేసింది. అయితే గతంలో కంటే ప్రస్తుతం టీవీ షోస్ లోనే ఎక్కువగా కనిపిస్తోందీ అందాల యాంకరమ్మ. పలు కామెడీ షోస్, డ్యాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా, హోస్టుగా, టీమ్ లీడర్ గా ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో నూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. తన లేటెస్ట్ గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్ ను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది రష్మీ.

త్వరలోనే మీ ముందుకు వస్తా..

ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోను షేర్ చేసిన రష్మీ.. ‘నేను సర్జరీ చేయించుకోవడానికి అన్నీ సెట్ చేసుకున్నాను. నా భుజాన్ని సెట్ చేసుకోవడానికి ఇక వెయిట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఆ గాయం నా డాన్స్ మూమెంట్స్ కి చాలా ఇబ్బంది కలిగిస్తోంది. వాటన్నింటినీ నేను మిస్ అవుతున్నాను. ఆ సర్జరీ అయ్యాక అంతాసెట్ అవుతుందని భావిస్తున్నాను. మళ్లీ ఎప్పటిలాగే మీముందుకు రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాను ’ అని రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

యాంకర్ రష్మీ గౌతమ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

ప్రస్తుతం రష్మీ షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ష్మీ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మళ్లీ మునుపటి లాగే టీవీషోస్, సినిమాలతో బిజీ కావాలని కామెంట్స్ చేస్తున్నారు.

అయోధ్య బాల రాముడిని దర్శించుకుంటోన్న యాంకర్ రష్మీ..

 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.