రికార్డుల పరంపర కొనసాగిస్తున్న అలా వైకుంఠపురంలో.. తాజాగా మరొకటి తన ఖాతాలో వేసుకుంది..

ఏ క్షణాన అలా వైకుంఠపురం సినిమా మొదలెట్టారో కానీ రికార్డుల మెత మోగిస్తోంది. సంక్రాంతికి బరిలో నిలిచిన

రికార్డుల పరంపర కొనసాగిస్తున్న అలా వైకుంఠపురంలో.. తాజాగా మరొకటి తన ఖాతాలో వేసుకుంది..

ఏ క్షణాన అలా వైకుంఠపురం సినిమా మొదలెట్టారో కానీ రికార్డుల మెత మోగిస్తోంది. సంక్రాంతికి బరిలో నిలిచిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అల్లుఅర్జున్ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది. పలు చోట్ల బాహుబలి రికార్డులను బద్దలుకొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వలో వచ్చిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ క్రియేషన్స్ నిర్మించారు.

ఈ సినిమాలోని అన్ని పాటలు యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేశాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ గురించి చెప్పనవసరం లేదు. ఈ సాంగ్‌కు ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్యాన్స్ చేసి అందరిని అలరించాడు కూడా. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్‌ను అత్యధిక మంది వీక్షించిన రికార్డు కూడా నమోదైంది. ఇందులో హీరోయిన్‌గా పూజాహెగ్డే నటించగా టబు, జయరాం, సుశాంత్, నవదీప్, నివేదాపేతురాజ్, సముద్రఖని ఇతర తారాగణం నటించారు. అయితే తాజాగా ఈ సినిమా మరో రికార్డును కైవసం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌‌లో సౌత్ ఇండియా టాప్ 10 సినిమాల్లో ఈ సినిమా తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దుల్కర్ సల్మాన్ నటించిన కన్నం కన్నం కొల్లయ్యదితల్, మళయాళ చిత్రం కప్పెలా, తర్వాత ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ఉన్నాయి. ఇలా రికార్డుల పరంపర కొనసాగిస్తుంది అలా సినిమా.

Click on your DTH Provider to Add TV9 Telugu