విరాటపర్వం చిత్ర యూనిట్‌కు సడెన్ షాక్ ఇచ్చిన అందాల భామ.. షూటింగ్‌లో పాల్గొని అందరిని..
టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో ఆరడుగుల ఆజానుబాహుడు దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్
టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో ఆరడుగుల ఆజానుబాహుడు దగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ విరాటపర్వం. వేణు ఊడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రానా ఒక సినిమా టేకాఫ్ చేశాడంటే ఎంత కష్టపడుతాడో అందరికి తెలిసిందే. ఎందుకంటే బాహుబలి సనిమాలో బళ్లాలదేవ క్యారెక్టర్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ పాత్రను రానా తప్పించి మరెవరూ చేయలరన్నట్లుగా ప్రేక్షకుల మదిలో తన ముద్రను వేశారు.
అయితే ఇటీవల లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ మళ్లీ ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో నివేదా పేతురాజ్ కీలక పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. అయితే ఈమె ఏ క్యారెక్టర్ చేస్తుందో మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. నివేదా ఇటీవల షూటింగ్‌లో పాల్గొందని తెలిసింది. రెగ్యులర్‌గా సన్నివేశాలు చిత్రీకరించి వీలైనంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ భావిస్తోంది.