Meena : ఎవరు విడాకులు తీసుకొన్నా నాతో పెళ్లి అని రాసేవారు.. మీనా కామెంట్స్..
దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు మీనా. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత అగ్ర కథానాయికగా సత్తా చాటింది. 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది.

సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఆ తర్వాత కథానాయికగా ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు కథానాయికగా రాణించిన మీనా.. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తుంది. ఇదెలా ఉంటే.. తాజాగా విలక్షణ నటుడు జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా కార్యక్రమానికి అతిథిగా హాజరై తన కెరీర్ విషయాలు పంచుకుంది.
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..
కృష్ణ, రజినీకాంత్ ఇద్దరికీ తాను కూతురుగా, హీరోయిన్ గా నటించినట్లు చెప్పారు. అలాగే చాలా మంది నిర్మాతలు ప్లాపులో ఉన్నామని.. తక్కువ డబ్బుతో సినిమా చేస్తున్నామని తనను సంప్రదించేవారని తెలిపింది. అందుకు తాను కూడా సరేనని చెప్పానని.. అలాంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపింది. మీనా మాట్లాడుతూ.. “”సినిమాలు సూపర్ హిట్ అయిన తర్వాత నన్ను మర్చిపోయేవారు. ఎప్పుడూ ఇలాగే జరిగేది. కెరీర్ లో వరుసగా అవకాశాలు వస్తున్నప్పుడే పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత పాప పుట్టిన రెండేళ్లకు మలయాళం సినిమా దృశ్యం కోసం నన్ను సంప్రదించారు. పాపను వదిలి వెళ్లలేక ఒప్పుకోలేదు. కానీ కథ రాసేటప్పుడు నన్ను ఊహించుకుని రాశామని అన్నారు. వేరే వారితో సినిమా చేయలేమని అన్నారు. దీంతో ఒప్పుకున్నాను” అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?
రెండో వివాహం గురించి మాట్లాడుతూ.. “”నా భర్త చనిపోయిన వారానికే నేను రెండో పెళ్లి చేసుకున్నట్లు రూమర్స్ రాశారు. వాళ్లకు కుటుంబాలు ఉండవా.. ఇలా రాస్తున్నారు అని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరు విడాకులు తీసుకున్న నాతో పెళ్లి అని రాసేవారు. అలాంటి వార్తల వల్ల నాకు అసహ్యం వేసేది” అంటూ చెప్పుకొచ్చారు. 2009లో సాఫ్ట్ వేర్ విద్యాసాగర్ ను వివాహం చేసుకున్నారు మీనా. 2022లో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..




