‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌లో ఆమిర్ ఖాన్..?

‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్‌’తో భారీ ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్న ఆమిర్ ఖాన్ తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటి నుంచి స్క్రిప్ట్ విషయంలో మరింత పక్కాగా ఉండాలనుకుంటోన్న మిస్టర్ పర్‌ఫెక్ట్ ఇంకా కథలను వింటూనే ఉన్నాడు. కాగా తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ రీమేక్‌లో ఆమిర్ ఖాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ హాలీవుడ్‌లో పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. టామ్ హాంక్స్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన […]

‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌లో ఆమిర్ ఖాన్..?
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 3:27 PM

‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్‌’తో భారీ ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకున్న ఆమిర్ ఖాన్ తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. ఇప్పటి నుంచి స్క్రిప్ట్ విషయంలో మరింత పక్కాగా ఉండాలనుకుంటోన్న మిస్టర్ పర్‌ఫెక్ట్ ఇంకా కథలను వింటూనే ఉన్నాడు. కాగా తాజా సమాచారం ప్రకారం హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ రీమేక్‌లో ఆమిర్ ఖాన్ నటించనున్నట్లు తెలుస్తోంది.

1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ హాలీవుడ్‌లో పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. టామ్ హాంక్స్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆరు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులను ఆమిర్ ఖాన్ దక్కించుకున్నడట. దీంతో ఈ చిత్రంలో ఆమిర్ నటించబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.