Megastar Chiranjeevi: రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేసిన గవర్నర్.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు..

ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు చిరంజీవి. రక్తదానం చేయడం వల్ల ఎంతోమందికి ప్రాణదానం చేసిన వాళ్లవుతారని తెలిపారు.

Megastar Chiranjeevi: రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేసిన గవర్నర్.. మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు..
Megastar

Updated on: Sep 04, 2022 | 12:42 PM

తెలంగాణ రాజ్‌భవన్‌లో రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు గవర్నర్‌ తమిళిసై. ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కు రక్తదానం చేసిన దాతలను, 50 సార్లు, అంతకంటే ఎక్కువసార్లు రక్తదానం చేసిన వారిని సన్మానించారు. అంతేకాకుండా వారికి చిరు భద్రత పేరుతో ఇన్స్యూరెన్స్‌ పత్రాలు అందించారు గవర్నర్‌. ఈ సందర్భంగా రక్తదాతలను అభినందించారు చిరంజీవి. రక్తదానం చేయడం వల్ల ఎంతోమందికి ప్రాణదానం చేసిన వాళ్లవుతారని తెలిపారు.

రక్తదానం చేయడం చిన్న విషయం కాదని అన్నారు గవర్నర్ తమిళి సై. రక్తదానం చేసినవారిలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుందని.. బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మందికి సేవ చేస్తున్న సినీనటుడు చిరంజీవికి ఆమె అభినందనలు తెలిపారు. రాజ్ భవన్ తరపున రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని.. అవసరమైన వారికి సయమానికి రక్తం అందించేందుకు ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్ కూడా రూపొందించామన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా అందులోని భాగం కావాలని కోరారు తమిళి సై. 1998లో రక్తం అందుబాటులో లేక చాలా మంది చనిపోయారని.. ఆ ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు మెగాస్టార్. తన కోసం ఏం చేయడానికైనా అభిమానులు ఉన్నారని.. వారి ప్రేమను నలుగురికి ఉపయోగపడేలా మార్చాలనే ఉద్ధేశ్యంతో చిరంజీవి బ్లడ్ బ్యాక్ ప్రారంభించామని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా 2-3 వేల మంది రక్తదానం చేస్తున్నారన్నారు. అలాంటి వారికి భద్రత ఇవ్వాలనే ఉద్ధేశ్యంతో చిరు భద్రత పేరుతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటివరకు 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని.. అందులో దాదాపు 70 శాతం పేదలకు మిగిలినది ప్రైవేట్ ఆసుపత్రులకు అందజేశామని.. త్వరలోనే ఆసుపత్రి కూడా కట్టించనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదనే సమస్య ఇప్పుడు తగ్గిందన్నారు మెగాస్టార్ చిరంజీవి.