Thandav Controversy : క్షమాపణలు కోరిన ‘తాండవ్’ టీమ్.. ఎవ్వరిని కించ‌ప‌ర్చ‌డానికి తెరకెక్కించలేదంటూ వివరణ

బాలీవుడ్‌ ప్రముఖ హీరోగా సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్‌సిరీస్‌ ‘తాండవ్‌’. భారతదేశ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ అమేజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ చేశారు..

Thandav Controversy : క్షమాపణలు కోరిన 'తాండవ్' టీమ్.. ఎవ్వరిని కించ‌ప‌ర్చ‌డానికి తెరకెక్కించలేదంటూ వివరణ
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 19, 2021 | 5:41 AM

Thandav Controversy : బాలీవుడ్‌ ప్రముఖ హీరోగా సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్‌సిరీస్‌ ‘తాండవ్‌’. భారతదేశ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ అమేజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ చేశారు. ఎన్నో అంచనాల నడుమ ఈ వెబ్‌ సిరీస్‌ జనవరి 15 నుంచి అమేజాన్‌ ప్రైమ్‌లో విడదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ వివాదాలతో సావాసం చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను అవమానిస్తూ.. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా సన్నివేశాలు ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ లో డింపుల్‌ కపాడియా, మహ్మద్‌ జీషన్‌ అయూబ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ జాఫర్‌ సినిమాను తెరకెక్కించగా ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. కాగా సినిమాలో హిందూ దేవుళ్లను అవమానిస్తూ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ వెబ్‌ సిరీస్‌ ఉందంటూ భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్‌ ముంబయిలోని ఘట్కోపర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు ప్రదర్శనను నిలిపివేయాలంటూ బీజీపీ ఎంపీ మనోజ్‌కుమార్‌ కొటక్‌ కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌కు లేఖ రాశారు. దాంతో తాండ‌వ్ వెబ్ టీమ్ దిగొచ్చింది.  సోమ‌వారం క్ష‌మాప‌ణ చెప్పింది. ఈ సిరీస్‌లోని ద్రుశ్యాలు ఏ ఒక్క‌రిని, ఏ మ‌త విశ్వాసాల‌ను కించ‌ప‌ర్చ‌డానికి ఉద్దేశించిన‌వి కావ‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. వెబ్ సిరీస్‌లోని అంశాల‌న్నీ క‌ల్పిత‌మేన‌ని పేర్కొంది. ఒక‌వేళ ఎవ‌రినైనా గాయ‌ప‌రిస్తే క్ష‌మించాల‌ని కోరింది. ఈ మేరకు ఈ సిరీస్ డైరెక్టర్ అలీ అబ్బాస్‌ జాఫర్‌ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఈ వివాదంపై అమెజాన్‌ను కేంద్ర సంచార శాఖ వివ‌ర‌ణ కోర‌డంతోపాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కేసు న‌మోదు కావ‌డంతో తాండ‌వ్ వెబ్ సిరీస్ టీం దిగి వ‌చ్చి క్ష‌మాప‌ణలు చెప్పింది.