S. P. Balasubrahmanyam : వైరల్ అవుతున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట.. భావోద్వేగానికి గురవుతున్న అభిమానులు
గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం మరణం ఇప్పటికీ సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నో వేల పాటలతో శ్రోతలను అలరించిన బాలసుబ్రమణ్యం
S. P. Balasubrahmanyam: గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం మరణం ఇప్పటికీ సంగీత ప్రియులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నో వేల పాటలతో శ్రోతలను అలరించిన బాలసుబ్రమణ్యం అనారోగ్యంతో గతఏడాది కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగు,తమిళ్, హిందీ, కన్నడ ఇలా పలు భాషల్లో పాటలను ఆలపించిన బాలుగారు అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలు గారు భూతికంగా మనమధ్య లేక పోయిన ఆయన పాడిన పాటల రూపంలో మనమధ్యనే ఉన్నారు. బాలుగారు చనిపోయే ముందు పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘దేవదాస్ పార్వతి’ అనే తమిళ్ సినిమాకోసం బాలుగారు పాడిన పాటను దర్శక నిర్మాతలు తాజాగా విడుదల చేశారు. అందమైన ఈ ప్రేమ పాటను బాలు గారు మరింత మధురంగా పాడారు. ఏడు పదుల వయసులోనూ బాలుగారు ఈ ప్రేమ పాటను తదైన శైలిలో పాడారు. ఈ పాటలో బాలుగారి గొంతు విని అభిమానులు మరోసారి భావోద్వేగానికి గురవుతున్నారు, ఎంతైనా ఆగొంతు తిరిగి రాదు అంటూ..ఎమోషనల్ అవుతున్నారు.