Tollywood : టాలీవుడ్ పై మనసుపారేసుకుంటున్న పొరుగు పొరుగుహీరోలు.. కారణం ఏంటంటే

హిట్‌ కళ ఇప్పుడు టాలీవుడ్‌లో ఉట్టిపడుతోంది. ఆ విషయం అర్థం చేసుకున్నారు కాబట్టే, తెలుగు నిర్మాతలకు పొరుగు హీరోలు ప్రత్యేకంగా కాల్షీట్లు ఇచ్చేస్తున్నారు.

Tollywood : టాలీవుడ్ పై మనసుపారేసుకుంటున్న పొరుగు పొరుగుహీరోలు.. కారణం ఏంటంటే
Danush, Thalapathi Vijay, S
Follow us

|

Updated on: Sep 23, 2022 | 12:57 PM

హిట్‌ కళ ఇప్పుడు టాలీవుడ్‌( Tollywood)లో ఉట్టిపడుతోంది. ఆ విషయం అర్థం చేసుకున్నారు కాబట్టే, తెలుగు నిర్మాతలకు పొరుగు హీరోలు ప్రత్యేకంగా కాల్షీట్లు ఇచ్చేస్తున్నారు. ప్రాజెక్టులు ఖాయం చేసుకుంటున్నారు. సెట్స్ మీద ఉన్న సినిమాలు, చర్చల్లో ఉన్న సినిమాలు అంటూ వార్తలు గట్టిగా వైరల్‌ అవుతున్నాయి. వాటిని నిజం చేయడానికి మన నిర్మాతలతో పొరుగు హీరోలు ములాఖత్‌ అవుతున్నారు. ఈ ఏడాది జెట్‌ స్పీడ్‌ మీదుంది ధనుష్‌ కెరీర్‌. హాలీవుడ్‌ మూవీ ది గ్రే మేన్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్‌గా రిలీజైన తిరు చిత్రంబలం సినిమాకి ఆల్‌ ఓవర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది. నానే వరువేన్‌ సినిమా మీద గట్టి హోప్స్ ఉన్నాయి. వాటన్నిటితో పాటు తెలుగు, తమిళ్‌లో ఆయన నటిస్తున్న సర్‌ సినిమా కచ్చితంగా హిట్‌ అయి తీరుతుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఫిల్మీ సర్కిల్స్ లో. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్‌ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ నిర్మిస్తున్నాయి. ఇంతకు ముందు పలు అనువాద చిత్రాలతో తెలుగువారిని పలకరించారు ధనుష్‌. ఆయన కెరీర్‌లో ఫస్ట్ తెలుగు సినిమా ఇదే.

కోలీవుడ్‌ హీరోల్లో రీసెంట్‌ టైమ్స్ లో బ్యాక్‌ టు బ్యాక్‌ తన సినిమాలతో వంద కోట్లు కలెక్ట్ చేస్తున్న హీరో శివ కార్తికేయన్‌. లాస్ట్ ఇయర్‌ డాక్టర్‌ మూవీతో సైలెంట్‌గా హండ్రడ్‌ క్రోర్స్ మార్క్ ని టచ్‌ చేశారు శివ. ఈ ఏడాది డాన్‌తో దాన్ని కంటిన్యూ చేశారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న సినిమా ప్రిన్స్. అనుదీప్‌ కె.వి. దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, సురేష్‌ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్‌ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ దీపావళికి విడుదల కానుంది ప్రిన్స్. ఇంతకు ముందు కౌసల్యా కృష్ణమూర్తిలో నటించిన శివకార్తికేయన్‌కి, ప్రిన్స్… హీరోగా ఫుల్‌ప్లెడ్జ్ డ్‌ తెలుగు సినిమా. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల్లో విజయ్‌ వారిసుకి స్పెషల్‌ క్రేజ్‌ ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి డేట్‌ని టార్గెట్‌ చేసింది. విజయ్‌ని ఫేస్‌ చేసిన ప్రతిసారీ ఫ్యాన్‌ గర్ల్ మొమెంట్‌ని ఎంజాయ్‌ చేస్తూనే ఉన్నారు హీరోయిన్‌ రష్మిక మందన్న. ఈ ఏడాది బీస్ట్ విజయ్‌కి ఆశించిన ఫలితం తీసుకురాలేదు. వారిసు ఆ కొరత తీరుస్తుందంటున్నారు దళపతి ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

తమిళ హీరోల్లో మరింత ఫ్లెక్సిబుల్‌గా ఉన్న హీరోగా ప్రొజెక్ట్ అవుతారు కార్తి. ఈ జనరేషన్‌ హీరోలు తెలుగు స్ట్రెయిట్‌ సినిమా చేయాలా? వద్దా? అని ఆలోచిస్తుండగానే, సినిమా చేసేసిన హీరో కార్తి. నాగార్జునతో కలిసి ఆయన చేసిన ఊపిరి అప్పట్లో చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. స్ట్రెయిట్‌ సినిమాలు చేయడానికి తానెప్పుడూ రెడీ అంటున్నారు కార్తి. మణిరత్నం దర్శకత్వంలో ఆయన నటించిన పొన్నియిన్‌ సెల్వన్‌ మీదే ఇప్పుడు జనాల ఆసక్తి. కార్తి బిగ్‌ బ్రదర్‌ సూర్య కూడా ఇప్పుడు స్ట్రెయిట్‌ సినిమా చేస్తున్నారు. స్టూడియో గ్రీన్‌తో కలిసి యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో సూర్య హీరోగా నటిస్తున్నారు. దిశ పటాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్య ఐదు గెటప్పుల్లో నటిస్తారని టాక్‌. ప్రతి గెటప్పుకీ కథలో ఇంపార్టెన్స్ ఉంటుందన్నది యూనిట్‌ నుంచి అందుతున్న సమాచారం. తమిళ హీరోల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ విజయ్‌ సేతుపతి పేరు లేకుండా ఆ టాపిక్‌ కంప్లీట్‌ కాదు. ఉప్పెన సినిమాతో డైరక్ట్ తెలుగు ఎంట్రీ ఇచ్చారు విజయ్‌ సేతుపతి. ఇప్పుడు ప్యాన్‌ ఇండియా ఆర్టిస్టుగా ప్రొజెక్ట్ అవుతున్న ఈ హీరో, త్వరలో పుష్పలోనూ కనిపిస్తారనే ప్రచారం ఉంది. రీసెంట్‌గా కణ్మణీ రాంబో ఖతీజా, విక్రమ్‌ సినిమాల్లో నటించిన సేతుపతి త్వరలో స్ట్రెయిట్‌ తెలుగు సినిమా చేస్తారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. TV9 (ET Desk) మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..