అశ్లీల చిత్రాలతో ఆ నటికి వేధింపులు.. తట్టుకోలేక ఏం చేసిందంటే..?
తనతో సన్నిహితంగా ఉన్న అశ్లీల చిత్రాల విడియోతో బెదిరిస్తున్నాడంటూ బుల్లితెర నటుడిపై మరో సినీ, బుల్లితెర సహాయ నటి శనివారం రాత్రి స్థానిక వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వివరాలు చూస్తే స్థానిక వడపళని, ఆర్కాడు రోడ్డులో నివశిస్తున్న సినీ, బుల్లితెర సహాయ నటి జెనీఫర్. ఈమె శనివారం రాత్రి స్థానిక వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేసింది. అందులో మూడేళ్ల క్రితం ప్రకృద్దీన్ అనే సహాయ నటుడు తనకు పరిచయం అయ్యాడని పేర్కొంది. అతను […]
తనతో సన్నిహితంగా ఉన్న అశ్లీల చిత్రాల విడియోతో బెదిరిస్తున్నాడంటూ బుల్లితెర నటుడిపై మరో సినీ, బుల్లితెర సహాయ నటి శనివారం రాత్రి స్థానిక వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వివరాలు చూస్తే స్థానిక వడపళని, ఆర్కాడు రోడ్డులో నివశిస్తున్న సినీ, బుల్లితెర సహాయ నటి జెనీఫర్. ఈమె శనివారం రాత్రి స్థానిక వడపళని పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేసింది. అందులో మూడేళ్ల క్రితం ప్రకృద్దీన్ అనే సహాయ నటుడు తనకు పరిచయం అయ్యాడని పేర్కొంది. అతను భార్యను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నట్లు చెప్పాడంది. దీంతో తాను అతనితో సన్నిహితంగా మెలిగానని తెలిపింది.
కాగా తాను అతనితో సన్నిహితంగా ఉన్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి తనను బెదిరిస్తున్నట్లు చెప్పింది. ఇంతకు ముందే అతనిపై తాను ట్రిప్లికేన్, పుళల్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, అప్పుడు పోలీసులు అతన్ని పిలిపించి హెచ్చరించారని తెలిపింది. కాగా ఇప్పుడు మళ్లీ తనను బెదిరిస్తున్నట్లు పేర్కొంది. శనివారం ప్రకృద్దీన్ తన ఇంటికి వచ్చి తన తల్లిని చంపుతానని బెదిరించాడని ఆరోపించింది. దీంతో వడపళని పోలీసులు సహాయ నటుడు ప్రకృద్దీన్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.