Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ అవకాశం ఆస్కార్‌‌తో సమానం: చిరుపై 30 ఇయర్స్ పృథ్వీ ఓ రేంజ్ ప్రశంసలు

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజమౌళి, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై వైసీపీ నేత, ఎస్వీబీసీ ఛైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. చిరంజీవిపై ఓ రేంజ్ ప్రశంసలు కురిపించారు. ఇందులో తనకు అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతం అంటూ […]

ఈ అవకాశం ఆస్కార్‌‌తో సమానం: చిరుపై 30 ఇయర్స్ పృథ్వీ ఓ రేంజ్ ప్రశంసలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 24, 2019 | 12:41 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజమౌళి, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై వైసీపీ నేత, ఎస్వీబీసీ ఛైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. చిరంజీవిపై ఓ రేంజ్ ప్రశంసలు కురిపించారు. ఇందులో తనకు అవకాశం రావడం పూర్వ జన్మ సుకృతం అంటూ మెగాస్టార్‌పై తన ప్రేమను అంతా చాటుకున్నాడు.

‘‘సైరాలో నేను మాధవయ్యర్ పాత్రలో నటించాను. నేను ఢిల్లీ నుంచి వచ్చి అన్నయ్యను (చిరంజీవి) కలిస్తే.. ఈ క్యారెక్టర్ ఎవరికి రాసిపెట్టి ఉంటే వారికి వస్తుందిరా. నీకు దక్కింది. డూ ఇట్. డూ యువర్ బెస్ట్ అని ప్రోత్సహించారు. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకున్నా అన్నయ్య రుణం తీరదు. ఈ అవకాశం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా. నాకు ఇది ఆస్కార్ అవార్డుతో సమానం. ఈ సినిమాలో అన్నయ్య గొప్పదనం గురించి చెప్పే అద్భుత క్యారెక్టర్‌ను నాకు ఇచ్చారు. ఈ క్యారెక్టర్ నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. జీవితంలో ఈ పాత్ర ఒక్కటే చాలు. ఇంకా చేయకపోయినా ఫర్వాలేదు. ఆ తిరుమల వెంకన్న ఆశీస్సులు మెగాస్టార్‌కి ఉండాలి. అన్ని భాషల్లోనూ సైరా సినిమా రికార్డులు బద్దలు కొట్టాలి’’ అంటూ తన మనసులోని భావాలన్నీ బయటకు చెప్పేశాడు పృథ్వీ.

కాగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. ఇందులో చిరు సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, రవి కిషన్, విజయ్ సేతుపతి, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రలలో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించగా.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.