AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సైరా‘కు సెన్సార్ పూర్తి.. ఇన్నర్ టాక్ ఏంటంటే..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రంకు ‘సైరా’కు సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా ఈ మూవీపై సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. మూవీలో చిరు నటన అదిరిపోయిందని.. ప్రధాన పాత్రాధారులందరూ సినిమాకు పెద్ద ప్లస్ అని.. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని.. మ్యూజిక్ కూడా అదిరిపోయిందని చిరు కెరీర్‌లో […]

‘సైరా‘కు సెన్సార్ పూర్తి.. ఇన్నర్ టాక్ ఏంటంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 24, 2019 | 5:32 PM

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రంకు ‘సైరా’కు సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్‌లు లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను ఇచ్చారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా ఈ మూవీపై సెన్సార్ సభ్యులు ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. మూవీలో చిరు నటన అదిరిపోయిందని.. ప్రధాన పాత్రాధారులందరూ సినిమాకు పెద్ద ప్లస్ అని.. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని.. మ్యూజిక్ కూడా అదిరిపోయిందని చిరు కెరీర్‌లో మరో విజయం ఖాయమని సెన్సార్ సభ్యులు చెప్పినట్లు సమాచారం. ఇక సెన్సార్ కూడా పూర్తి అవ్వడంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచనుంది సైరా టీం.

కాగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా తెరకెక్కింది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన సైరాను రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇక ఇందులో చిరు సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, రవి కిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అక్టోబర్ 2న విడుదల కాబోతోంది. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కడం.. బహుభాషా నటులు ఈ మూవీలో భాగం కావడం, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడంతో సైరాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను చిరు ఏ మేరకు అందుకుంటాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us
రామ్ చరణ్‌ సర్జరీ సక్సెస్.. బెడ్ రెస్ట్ ఎన్ని రోజులంటే?
రామ్ చరణ్‌ సర్జరీ సక్సెస్.. బెడ్ రెస్ట్ ఎన్ని రోజులంటే?
వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్తా!
వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్తా!
ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌?
ఇద్దరు ఆటగాళ్లు + 10 కోట్లు.. ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ట్రేడ్‌?
మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఇలా చెక్ చేయండి!
మీరు వాడుతున్న కుంకుమపువ్వు అసలైనదేనా? ఇలా చెక్ చేయండి!
జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ SUV స్పెషాలిటీస్
జీప్ మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్ SUV స్పెషాలిటీస్
కలలో జుట్టు కత్తిరించుకున్నట్లు కనిపించిందా? ఇది శుభమా? అశుభమా?
కలలో జుట్టు కత్తిరించుకున్నట్లు కనిపించిందా? ఇది శుభమా? అశుభమా?
‘మిషన్ శక్తిశాట్’కి ఎంపికైన ఏకైక AP విద్యార్థిని జెస్సీ..
‘మిషన్ శక్తిశాట్’కి ఎంపికైన ఏకైక AP విద్యార్థిని జెస్సీ..
హోండా నుంచి సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. విశేషాలివే
హోండా నుంచి సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ స్కూటర్.. విశేషాలివే
మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
చావు అంచులవరకు వెళ్లిన జబర్దస్త్ జీవన్ ను కాపాడిందెవరో తెలుసా?
చావు అంచులవరకు వెళ్లిన జబర్దస్త్ జీవన్ ను కాపాడిందెవరో తెలుసా?