కటౌట్లపై తమిళ స్టార్ల చొరవ.. టాలీవుడ్ హీరోల మౌనం!

కటౌట్లపై తమిళ స్టార్ల చొరవ.. టాలీవుడ్ హీరోల మౌనం!

సినిమాలతో పాటు సోషల్ యాక్టివిటీస్‌లో కూడా తమిళ హీరోలు ఎక్కువగా పాల్గొంటారు. తంబీలకు కష్టమొచ్చిందంటే చాలు.. అక్కడి రాజకీయ నాయకులకంటే ముందుగా హీరోలే స్పందిస్తుంటారు. నాడు తమిళనాడు వరదల్లో మునిగిన వేళ.. టాప్ హీరోలు సైతం సామాన్యుల మాదిరి అందరితోనే సామాన్లు మోశారు. ఇంకా చెప్పాలంటే జల్లికట్టు వివాద సమయంలో కూడా హీరోల పాత్ర కీలకమని చెప్పడంలో వింతేమీ లేదు.  పేదవాళ్ళు కష్టాల్లో ఉంటే చాలు విరాళాలు సేకరించి ఆదుకుంటారు. ఈ తమిళ హీరోలు తాజాగా చెన్నైలో […]

Ravi Kiran

|

Sep 21, 2019 | 1:46 PM

సినిమాలతో పాటు సోషల్ యాక్టివిటీస్‌లో కూడా తమిళ హీరోలు ఎక్కువగా పాల్గొంటారు. తంబీలకు కష్టమొచ్చిందంటే చాలు.. అక్కడి రాజకీయ నాయకులకంటే ముందుగా హీరోలే స్పందిస్తుంటారు. నాడు తమిళనాడు వరదల్లో మునిగిన వేళ.. టాప్ హీరోలు సైతం సామాన్యుల మాదిరి అందరితోనే సామాన్లు మోశారు. ఇంకా చెప్పాలంటే జల్లికట్టు వివాద సమయంలో కూడా హీరోల పాత్ర కీలకమని చెప్పడంలో వింతేమీ లేదు.  పేదవాళ్ళు కష్టాల్లో ఉంటే చాలు విరాళాలు సేకరించి ఆదుకుంటారు. ఈ తమిళ హీరోలు తాజాగా చెన్నైలో చోటు చేసుకున్న ఓ విషాద ఉదంతంపై గళం విప్పడమే కాకుండా హైకోర్టు కూడా స్పందించేలా చేశారు.

పళ్లికరనై సమీపంలో టూవీలర్ మీద వెళుతున్న శుభశ్రీ అనే మహిళపై భారీ ఫ్లెక్సీ పడింది. ఆమె కింద పడిపోగా.. అంతలోనే వాటర్ ట్యాంకర్ ఆమె మీద దూసుకుపోవటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అధికార పార్టీకి చెందిన నేత కోసం ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ పైన తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఈ ఉదంతంపై కోలీవుడ్ అగ్రనాయకులు పెదవి విప్పటమే కాకుండా.. తమ ఫ్యాన్స్‌కు బ్యానర్లు ఏర్పాటు చేయొద్దని.. పెద్ద పెద్ద కటౌట్లు పెట్టొద్దని సూచించారు.

ఏ హీరో సినిమా రిలీజైనా సదురు హీరో అభిమానులు పెద్ద పెద్ద బ్యానర్లు, కటౌట్లు పెట్టి హడావుడి చేస్తారు. ఇకపై అలాంటి హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు తమిళ హీరోలు. తమ సినిమా ప్రమోషన్స్‌కు గానీ.. ప్రెస్ మీట్స్, ప్రోగ్రామ్స్ ఏదైనా కూడా బ్యానర్లు, కటౌట్లను ఏర్పాటు చేయొద్దని విన్నవించుకుంటున్నారు.

కమల్ హాసన్, సూర్య, విజయ్.. వంటి స్టార్ హీరోలు ఇప్పటికే ఈ విషయాన్ని అభిమానులకు తెలిపారు. వీరందరూ కూడా ఇలాంటి తరహా వేడుకల్ని నిషేధించి.. సామాజిక సేవా కార్యక్రమాలను మొదలు పెట్టాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. రక్త దానాలు, పేదవారికి సహపడటం, విద్యార్థులకు సాయం చేయడం, ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కటౌట్ వల్ల ఓ నిండు ప్రాణం బలవడంతో తమిళ హీరోలంతా గట్టిగా స్పందిస్తే.. తెలుగు హీరోలు మాత్రం ఇలాంటి అంశాలపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. విజయ్ దేవరకొండ, సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్, పలు యంగ్ హీరోలు మాత్రం అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుంటే.. స్టార్ హీరోలు మాత్రం సోషల్ ఇష్యూ‌లుపై స్పందించకపోవడం విచారకరం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu