15 ఇయర్స్ ఇండస్ట్రీ.. గ్లామర్ తారల తళుకులు ఇంకెన్నాళ్లు?

15 ఇయర్స్ ఇండస్ట్రీ.. గ్లామర్ తారల తళుకులు ఇంకెన్నాళ్లు?

సినిమాలు ఎలాంటివైనా.. ఆయా చిత్రాల్లో హీరోయిన్లు కీలకపాత్రలు పోషించినా వాళ్లకి హీరోల కంటే తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి తరుణాన్ని సైతం ఎదుర్కొని వారి టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. అందం, అభినయంతో కెరీర్ స్టార్టింగ్ నుంచీ ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్స్ తెలుగు ప్రేక్షకులను మరింతగా దగ్గరయ్యారు. మాములుగా హీరోయిన్లు ఐదేళ్ల కాలం కొనసాగడమే ఎక్కువ.. అలాంటిది పదేళ్లు కొనసాగితే అదో రికార్డు. ఇక అలాంటి వారిలో కొంతమంది హీరోయిన్లు ఈ మధ్య 15 […]

Ravi Kiran

|

Sep 21, 2019 | 2:52 PM

సినిమాలు ఎలాంటివైనా.. ఆయా చిత్రాల్లో హీరోయిన్లు కీలకపాత్రలు పోషించినా వాళ్లకి హీరోల కంటే తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి తరుణాన్ని సైతం ఎదుర్కొని వారి టాలెంట్‌తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న నటీమణులు ఎందరో ఉన్నారు. అందం, అభినయంతో కెరీర్ స్టార్టింగ్ నుంచీ ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్స్ తెలుగు ప్రేక్షకులను మరింతగా దగ్గరయ్యారు. మాములుగా హీరోయిన్లు ఐదేళ్ల కాలం కొనసాగడమే ఎక్కువ.. అలాంటిది పదేళ్లు కొనసాగితే అదో రికార్డు. ఇక అలాంటి వారిలో కొంతమంది హీరోయిన్లు ఈ మధ్య 15 ఇయర్స్ ఇండస్ట్రీ మార్కు దాటారు. ఈ లిస్ట్‌లో కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా, శ్రియ శరణ్ మొదలగున వారు ఉన్నారు.

కాజల్ కెరీర్ గ్రాఫ్…

2004లో ‘క్యోం హోగయానా’ అనే బాలీవుడ్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన కాజల్.. తెలుగు తెరకు కళ్యాణ్ రామ్ హీరోగా తేజ డైరెక్షన్‌లో వచ్చిన ‘లక్షీ కళ్యాణం’తో పరిచయమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో కమర్షియల్, పలు సామాజిక చిత్రాల్లో నటించిన మెప్పించింది. ఇక ఇప్పటికీ ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

తమన్నా కెరీర్ గ్రాఫ్…

2005 లో ‘చాంద్ సా రోషన్ చెహేరా’ అనే బాలీవుడ్ చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసిన తమన్నా.. తెలుగు తెరకు ‘శ్రీ’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు దాదాపు అందరితోనూ చిందేసిన ఈ బ్యూటీ వచ్చే ఏడాది మార్చికి ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకోనుంది. ఇప్పటికీ తమన్నాకు వరుసగా బడా ఆఫర్స్ దక్కుతున్నాయి. మెగాస్టార్ ‘సైరా’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

శ్రియ కెరీర్ గ్రాఫ్…

కాజల్, తమన్నా కంటే శ్రియ సీనియర్.. 2001లో ‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు డైరెక్టర్లు విక్రమ్ కుమార్-రాజ్ కుమార్. ఈ దర్శకద్వయంలో  మొదటి వ్యక్తి ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ డైరెక్టరే. కెరీర్ మొదటి నుంచీ శ్రియ వరుస హిట్స్ సాధిస్తూ అనధికాలంలోనే  స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ప్రస్తుతం శ్రియ నటిస్తున్న నాలుగు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. కాగా ఆమె ఇండస్ట్రీలో 18 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది.

ఇక ఈ ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటి ఉంది. ముగ్గురూ కూడా ఫేడ్ అవుట్ అయిపోయారని రూమర్స్ నెట్టింట్లో హల్చల్ చేసిన ప్రతిసారి.. రీ-సౌండ్ ఇచ్చే హిట్స్‌తో సమాధానం చెప్పారు. వీరందరూ ఇన్నేళ్లు గ్లామర్.. నటన.. ఒకే యాటిట్యూడ్‌ను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కొత్తగా వస్తున్న యంగ్ హీరోయిన్లకు వీరు ప్రేరణగా నిలుస్తున్నారు. మరోవైపు వీరి ముగ్గురికి ఎటువంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకపోవడం గమనార్హం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu