Mahesh in Chiru movie: చిరు మూవీలో మహేష్.. చెర్రీ తప్పుకోవడం వెనుక కారణామిదేనా..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో.. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఇందుకోసం 45రోజుల క్యాల్షీట్లు కూడా ఇచ్చారని ఆ మధ్యన వార్తలు వచ్చాయి.

Mahesh in Chiru movie: చిరు మూవీలో మహేష్.. చెర్రీ తప్పుకోవడం వెనుక కారణామిదేనా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 25, 2020 | 9:09 PM

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో.. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని, ఇందుకోసం 45రోజుల క్యాల్షీట్లు కూడా ఇచ్చారని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం మహేష్‌ను సంప్రదించాలని కొరటాల శివ, చెర్రీ భావిస్తున్నట్లు ఇటీవల పుకార్లు గుప్పుమంటున్నాయి. అంతేకాదు ఇప్పటికే దీనికి సంబంధించి మహేష్‌తో కొరటాల సంప్రదింపులు కూడా జరిపారని, సూపర్‌స్టార్ కూడా ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే తన తండ్రితో కలిసి నటించే అవకాశం ఉన్నా.. ఈ మూవీ కోసం మహేష్‌ను ఎంచుకోవడం వెనుక చెర్రీకి కారణాలున్నాయట.

అదేంటంటే.. చెర్రీ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీకి ఒప్పుకున్న తరువాత ఇందులో నటిస్తున్న ఎన్టీఆర్, చెర్రీలతో ఓ అగ్రిమెంట్ తీసుకున్నారట జక్కన్న. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే వరకు.. చెర్రీ, ఎన్టీఆర్ మరో చిత్రంలో కనిపించకూడదని చెప్పారట. ఇక ఈ మూవీని త్వరగానే పూర్తి చేస్తానని జక్కన్న చెప్పడంతో.. దానికి ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఓకే చెప్పారట. అయితే కొన్ని కారణాల వలన సినిమా విడుదల వాయిదా పడటంతో.. ఇప్పుడు వీరిద్దరికి సమస్యలు వస్తున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌కు ఓకే చెప్పినప్పటికీ.. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు.

అయితే చిరు-కొరటాల మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అంతేకాదు చిరు మూవీ కోసం ఇప్పటికే ఏడాదిన్నర్రకు పైగా వెయిట్ చేసిన కొరటాల.. ఈ మూవీ తరువాత మరో హీరోతో సెట్స్ మీదకు వెళ్లాలని అనుకుంటున్నారట. కానీ ఆర్ఆర్ఆర్ అగ్రిమెంట్ నేపథ్యంలో.. ఈ మూవీని ఈ ఏడాది విడుదల చేసే అవకాశం ఉండదు. అందుకే ఈ పాత్ర కోసం మరో స్టార్ హీరోను తీసుకుందామని కొరటాల, చెర్రీ డిస్కస్ చేసుకున్నారట. ఈ నేపథ్యంలో చరణ్, మహేష్ పేరును సూచించడం, దానికి కొరటాల కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే సూపర్‌స్టార్ లైన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? మెగాస్టార్ సినిమాలో సూపర్‌స్టార్ ఉన్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. Read This Story Also: మెగాస్టార్ మూవీలో సూపర్‌స్టార్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!