Breaking News
  • దేశవ్యాప్తంగా దీపయజ్ఞం. ప్రధాని మోదీ పిలుపు మేరకు దీపాలు వెలిగించిన దేశ ప్రజలు. దీపం వెలిగించిన రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు. దీపాల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందిన భారత్‌. తెలుగు రాష్ట్రాల్లో దీపాల కాంతులు. ప్రగతి భవన్‌లో దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్‌. తాడేపల్లిలోని తన నివాసంలో దీపాలు వెలిగించిన ఏపీ సీఎం జగన్‌. దీపాలు వెలిగించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు తమిళిసై, భిశ్వభూషణ్. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు. అత్యవసరసేవలు అందిస్తున్న వైద్యులు, పోలీసులు.. పారిశుద్ధ్య సిబ్బందికి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపిన ప్రజలు.
  • 130 కోట్ల ప్రజల మహాశక్తిని చాటిన భారతీయులు. దీప యజ్ఞంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు. కుటుంబ సమేతంగా దీపం వెలిగించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తన నివాసంలో దీపాలు వెలిగించిన ప్రధాని మోదీ. తమ తమ నివాసాల్లో దీపాలు వెలిగించిన కేంద్ర మంత్రులు, ఎంపీలు.
  • ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ఫోన్‌. రాష్ట్రంలో ధాన్యం సేకరణకు 20 కోట్ల గన్నీ బ్యాగ్‌లు అవసరం. ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌. గన్నీ బ్యాగ్‌లకు తీవ్ర కొరత ఉందని వివరించిన సీఎం కేసీఆర్‌. పశ్చిమబెంగాల్‌లో గన్నీ బ్యాగ్‌ల పరిశ్రమలు తెరిపించాలన్న కేసీఆర్‌. పరిశ్రమలు తెరిపిస్తేనే గన్నీ బ్యాగ్‌ల సమస్య తీరుతుందన్న కేసీఆర్‌. పశ్చిమ బెంగాల్‌ నుంచి ప్రత్యేక రైళ్ల ద్వారా గన్నీ బ్యాగ్‌లు.. తీసుకొచ్చేందుకు అనుమతించాలని ప్రధాని మోదీకి కేసీఆర్‌ విజ్ఞప్తి. సంబంధిత శాఖలతో మాట్లాడతానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ.
  • ఒక్క తప్పుడు మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసినా కేసులు బుక్‌ చేస్తాం. వెరిఫై చేయకుండా సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేయొద్దు. డిజిటల్‌గా వెదికి పట్టుకుని అరెస్ట్‌ చేస్తాం. నిజాముద్దీన్‌ నుంచి వచ్చిన వారిలో ఎవరూ కావాలని.. కరోనా వ్యాప్తి చేశారనడానికి ఆధారాలు లేవు. -టీవీ9 ఎన్‌కౌంటర్‌ విత్‌ మురళీకృష్ణలో అంజనీకుమార్‌, సజ్జనార్‌.
  • కర్నూలులో కరోనా విజృంభణ. ఒకేరోజు 12 పాజిటివ్‌ కేసులు నమోదు. 12 మంది ఢిల్లీ సభలకు వెళ్లివచ్చిన వారే. కర్నూలులో మొత్తం 53 కరోనా కేసులు నమోదు. కాంటాక్ట్‌ కేసులపై దృష్టిపెట్టిన అధికారులు.

మెగాస్టార్ మూవీలో సూపర్‌స్టార్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో చిరు
Mahesh in Acharya movie, మెగాస్టార్ మూవీలో సూపర్‌స్టార్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ఆచార్య. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో చిరు సరసన త్రిష నటిస్తోంది. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీలో సూపర్‌స్టార్ మహేష్‌ బాబు నటించబోతున్నారట.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రామ్ చరణ్ డేట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పాత్రను తాను కాకుండా మరో హీరోతో చేయించాలని చెర్రీ భావిస్తున్నారట. ఈ క్రమంలో రామ్ చరణ్ మనసులో మహేష్ మెదిలారట. ఈ విషయాన్ని దర్శకుడికి కూాడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇటీవల కొరటాల శివ, మహేష్‌ను కలిసి పాత్ర గురించి చెప్పినట్లు టాక్. ఇక కొరటాలతో ఉన్న సాన్నిహిత్యంతో ఆ పాత్రలో నటించేందుకు మహేష్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

Mahesh in Acharya movie, మెగాస్టార్ మూవీలో సూపర్‌స్టార్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!

అంతేకాకుండా మెగాస్టార్ కుటుంబంతో మహేష్‌‌‌కు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. రామ్ చరణ్‌, మహేష్‌ ఎప్పటినుంచో మంచి మిత్రులు. కుటుంబపరంగానూ వీరిద్దరు పలు అకేషన్లలో కలుసుకుంటూ ఉంటారు. ఇక మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ ముఖ్య అతిథిగా హాజరై.. అతడికి తన బ్లెస్సింగ్స్‌ను ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ముగ్గురు హీరోలతో విదేశీ టూర్‌కు వెళ్లాల్సి వస్తే ఎవ్వరితో వెళ్తారు అన్న ప్రశ్నకు చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ పేర్లు చెప్పారు మహేష్ బాబు. ఇలా మెగాస్టార్‌ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ దృష్ట్యా  ఇప్పుడు చిరు సినిమాలో నటించేందుకు మహేష్ కూడా ఒప్పుకున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ సినిమాకు సూపర్‌స్టార్ మరో అదనపు ఆకర్షణ అవుతారనడంలో ఎలాంటి సందేహం ఉండదు. అలాగే ఇరు వర్గాల ఫ్యాన్స్‌‌కు కూడా ఇది పండగ చేసుకునే వార్తనే అవుతుంది.
Read This Story Also:మొదటిసారి మరో హీరోతో.. చెర్రీ క్రేజీ ప్లాన్..!

Related Tags