టబు భారీ డిమాండ్.. అనసూయకు క్రేజీ ఆఫర్..!

2018లో బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన 'అంధాధూన్‌'ను తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటించనున్న ఈ రీమేక్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం పూర్తి అయ్యాయి.

  • Tv9 Telugu
  • Publish Date - 8:27 pm, Tue, 25 February 20
టబు భారీ డిమాండ్.. అనసూయకు క్రేజీ ఆఫర్..!

2018లో బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘అంధాధూన్‌’ను తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటించనున్న ఈ రీమేక్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం పూర్తి అయ్యాయి. ఇక ఈ మూవీలో నటించే నటీనటుల వివరాలు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. ఓ పాత్ర కోసం హాట్ యాంకర్ అనసూయను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

ఒరిజనల్‌లో టబు చేసిన పాత్రను తెలుగులో అనసూయ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీలో టబు విలన్‌ పాత్రలో అందరినీ ఆకట్టుకోగా.. ఇక్కడ ఆ పాత్ర కోసం తొలుత ఆమెనే సంప్రదించారట. అయితే టబు కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో.. తరువాత అనసూయను కలిసినట్లు తెలుస్తోంది. ఇక ఈ రీమేక్‌లో నటించడం కోసం అనసూయకు రూ.10లక్షలు ముట్టనున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాలో అనసూయ ఉందో..? లేదో..? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. కాగా విలన్ పాత్ర చేయడం అనసూయకు కొత్తేం కాదు. క్షణం మూవీలో ఈ హాట్ యాంకర్ విలన్‌గా మెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ రీమేక్‌ కోసం ఆమెను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.