AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jailer: జైలర్‌ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. స్టన్నింగ్ లుక్‌లో సూపర్ స్టార్‌..

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'జైలర్‌'. రోబో తర్వాత సరైన విజయాన్ని అందుకోలేక పోయిన రజినీ ఈసారి ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలని ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు...

Jailer: జైలర్‌ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చేసింది.. స్టన్నింగ్ లుక్‌లో సూపర్ స్టార్‌..
Rajini Kanth Jailer Movie
Narender Vaitla
|

Updated on: Nov 20, 2022 | 3:31 PM

Share

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జైలర్‌’. రోబో తర్వాత సరైన విజయాన్ని అందుకోలేక పోయిన రజినీ ఈసారి ఎలాగైనా భారీ విజయాన్ని అందుకోవాలని ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘పేట’ ప్రేక్షలకు ఆకట్టుకున్న కమర్షియల్‌గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అందుకే జైలర్‌ సినిమా మేకింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎలాంటి కాంప్రమైజ్‌ లేకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్‌ ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ను ఇచ్చారు. మేకింగ్‌ గ్లింప్స్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో రజినీకాంత్‌ అదిరిపోయే లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. గ్లింప్స్‌ను చూస్తే రజినీకాంత్‌ మరోసారి పవర్‌ ఫుల్ రోల్‌లో నటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ సినిమాపై అంచనాలు పెంచగా ఈ మేకింగ్‌ గ్లింప్స్‌ సైతం మెస్మరైజ్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రియాంక అరుల్‌ మోహన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మేకర్స్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్‌ 14న ముహుర్తం ఫిక్స్‌ చేసుకున్నారు. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే జైలర్‌ చిత్రం ఏప్రిల్‌ 14న థియేటర్లలో సందడి చేయనుంది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇండస్ట్రీలో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు