తన సోల్‌ని వదలనన్న సుక్కూ.. బన్నీని ఒప్పించాడా..!
దాదాపు రెండేళ్ల తరువాత లెక్కల మాస్టర్ సుకుమార్ తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడిగా తనకు మొదటి అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్‌తో మూడోసారి సినిమాను చేస్తున్నారు సుక్కు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం లుక్‌పై కసరత్తులు చేస్తోన్న బన్నీ.. త్వరలో ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. దీంతో మిగిలిన పాత్రాధారులపై షూటింగ్‌ను చేస్తున్నారు సుకుమార్. కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుండగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ షాకింగ్ […]
దాదాపు రెండేళ్ల తరువాత లెక్కల మాస్టర్ సుకుమార్ తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. దర్శకుడిగా తనకు మొదటి అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్‌తో మూడోసారి సినిమాను చేస్తున్నారు సుక్కు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం లుక్‌పై కసరత్తులు చేస్తోన్న బన్నీ.. త్వరలో ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. దీంతో మిగిలిన పాత్రాధారులపై షూటింగ్‌ను చేస్తున్నారు సుకుమార్. కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుండగా.. ఈ మూవీకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇటీవల ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీ మ్యూజిక్ డైరక్టర్ మారనున్నాడని.
తన ఆస్థాన సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌నే ‘ఏఏ 20’ సినిమాకు తీసుకున్నారు సుకుమార్. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే మూడు పాటలు కూడా ఫైనల్ అయినట్లు ఆ మధ్యన ఓ సందర్భంలో డీఎస్పీ చెప్పుకొచ్చారు. అయితే దేవీ గ్రాఫ్ ఇటీవల పడిపోతూ రావడం.. తాను నటించిన అల వైకుంఠపురములోకు థమన్ అందించిన సంగీతం ప్లస్ అవ్వడంతో.. దేవీ స్థానంలో థమన్‌ను తీసుకోవాలని బన్నీ, సుకుమార్‌కు సూచించారట. అయితే ఈ విషయంలో సుకుమార్ అస్సలు వెనక్కి తగ్గనని చెప్పారట. దేవీని వదిలేది లేదని చెప్పిన సుక్కు.. బన్నీని ఎట్టకేలకు ఒప్పించారట. దీంతో అల్లు అర్జున్ ఒప్పుకోక తప్పలేదని తెలుస్తోంది.
అయితే సుకుమార్‌కు, దేవీకి మంచి ర్యాపో ఉంది. ఇద్దరి మధ్య వయసులో తారతమ్యం ఉన్నప్పటికీ.. కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ‘‘తన దృష్టిలో మ్యూజిక్ అంటే దేవీ.. దేవీ అంటే మ్యూజిక్’’ .. ‘‘డీఎస్పీ తన సోల్’’.. ‘‘తాను భక్తుడైతే, దేవీ తన దేవుడు’’.. ‘‘దేవీ లేనిది తాను సినిమాలు చేయలేను’’ అని పలు సందర్భాలలో రాక్‌స్టార్‌పై తన ప్రేమను వ్యక్తపరిచారు సుకుమార్. అంతేకాదు సుకుమార్ ప్రొడక్షన్‌లో నుంచి వచ్చిన మొదటి చిత్రం ‘కుమారి 21f’కు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా దేవీ పనిచేశారు. ఇక మిగిలిన వారి దగ్గర ఎలా ఉన్నా.. దేవీ తనకు మాత్రం కచ్చితంగా మంచి ట్యూన్స్ ఇస్తాడని సుకుమార్ బలంగా నమ్ముతుంటారు. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. ఆల్బమ్స్ మాత్రం అన్నీ హిట్లు అయ్యాయి. అందుకే రాక్‌స్టార్ విషయంలో రాజీ పడే ఆలోచనే లేదని సుక్కు, బన్నీని కన్విన్స్ చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఈ వార్తలో నిజం లేదని బన్నీ సన్నిహితులు చెబుతున్నారు. ఎందుకంటే బన్నీకి, దేవీకి కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికి ఏడు చిత్రాలు రాగా.. ఆ మూవీల ఆల్బమ్స్ అన్నీ మంచి హిట్లుగా మిగిలాయి. ఇక ఒకానొక సమయంలో బన్నీ సినిమా అంటే దేవీ ఉండాల్సిందే అన్న టాక్ కూడా నడిచింది. ఇలాంటి క్రమంలో దేవీ విషయంలో బన్నీ, సుకుమార్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని వారు అంటున్నారు. బన్నీ కూడా తన సినిమాకు దేవీ కొత్త మ్యాజిక్‌ను తెస్తాడని నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సుకుమార్ అంటే దేవీకి ఓ కొత్త ఊపు వస్తుంది. ఈ విషయం గతంలోనూ పలుమార్లు రుజువైంది. అంతేకాదు సుకుమార్ రైటింగ్స్‌లో తెరకెక్కుతోన్న ఉప్పెన ఫస్ట్‌వేవ్ టీజర్‌లోనూ దేవీ తన మ్యూజిక్‌తో అందరినీ కట్టిపడేశారు. ఈ నేపథ్యంలో సుకుమార్ అంటే దేవీ కచ్చితంగా మంచి ఆల్బమ్ ఇస్తాడని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం ఉప్పెన పాటలతో దేవీ తనపై వస్తోన్న విమర్శలకు చెక్ పెడుతాడని తెలుస్తోంది. మరి దేవీ కెరీర్ ఎలా ఉండబోతోంది..? గత కొన్ని సంవత్సరాలుగా టాప్ సంగీత దర్శకుడిగా కొనసాగుతోన్న దేవీ మళ్లీ తన స్థానాన్ని నిలుపుకోగలరా..? లాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం తేలనుంది.