అవునా.. బన్నీ-సుకుమార్ మూవీ షూటింగ్ ప్రారంభమైందా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అవును మీరు చదువుతున్నది నిజమే. ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించేశారు లెక్కల మాష్టారు సుకుమార్. అయితే ఈ చిత్రీకరణలో ఇంకా బన్నీ పాలు పంచుకోలేదు. ప్రస్తుతం అల వైకుంఠపురములో హడావిడిలో ఉన్న బన్నీ.. తన 20వ చిత్ర షూటింగ్‌లో ఇంకా పాల్గొనలేదు. కానీ ఈ లోపు టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేని సుకుమార్.. మూవీ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా […]

అవునా.. బన్నీ-సుకుమార్ మూవీ షూటింగ్ ప్రారంభమైందా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 11, 2020 | 1:55 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 20వ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. అవును మీరు చదువుతున్నది నిజమే. ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించేశారు లెక్కల మాష్టారు సుకుమార్. అయితే ఈ చిత్రీకరణలో ఇంకా బన్నీ పాలు పంచుకోలేదు. ప్రస్తుతం అల వైకుంఠపురములో హడావిడిలో ఉన్న బన్నీ.. తన 20వ చిత్ర షూటింగ్‌లో ఇంకా పాల్గొనలేదు. కానీ ఈ లోపు టైమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేని సుకుమార్.. మూవీ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.

ఇవాళ సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా AA20 పేరుతో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో కొండా, వాగుళ్లలో పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అయితే అందులో ప్రధాన పాత్రాధారులు ఎవరూ కనిపించలేదు. కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇక ఇందులో బన్నీ ఇంతవరకు నటించని పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన సరసన రష్మిక నటిస్తుండగా.. విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతుండగా.. ఇప్పటికే మూడు పాటలు కూడా పూర్తైనట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ సినిమాను ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. అయితే బన్నీ-సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే