యూవీ క్యాంప్‌లోనే సుజీత్.. తదుపరి చిత్రాన్ని ఫిక్స్ చేసుకున్న సాహో దర్శకుడు.. త్వరలోనే అధికారిక ప్రకటన
'రన్ రాజా రన్'తో టాలీవుడ్‌కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. రెండో సినిమాకే ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకుని హాట్ టాపిక్‌గా మారారు సుజీత్.
Sujeet next movie: ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్‌కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి.. రెండో సినిమాకే ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని సొంతం చేసుకుని హాట్ టాపిక్‌గా మారారు సుజీత్. అయితే సాహో అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ సుజీత్‌కి మాత్రం క్రేజ్ దగ్గలేదు. సుజీత్ పనితీరును గమనించిన మెగాస్టార్ చిరంజీవి.. అతడికి లూసిఫర్ రీమేక్‌ని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వలన సుజీత్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత ఛత్రపతి రీమేక్ ఆఫర్‌ని కూడా ఆయన వద్దన్నట్లు వార్తలు వినిపించాయి. (క్వారంటైన్ బబుల్‌లో రానా, సాయి పల్లవి.. షూటింగ్‌కి రెడీ అవుతోన్న ‘విరాట పర్వం’ టీమ్)
తన సొంత కథతోనే తదుపరి చిత్రాన్ని చేయాలన్న ఆలోచనలో సుజీత్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో తనను వరుస అవకాశాలు ఇచ్చిన యూవీ క్రియేషన్స్‌తోనే అతడు మూడోసారి పనిచేయబోతున్నారట. ఇక సుజీత్ తన తదుపరి సినిమా కోసం హీరోగా గోపిచంద్‌ని ఎంచుకున్నారట. ఇప్పటికే గోపికి సుజీత్ కథను వినిపించడం, అతడు ఒప్పుకోవడం జరిగిపోయాయని సమాచారం. అంతేకాదు త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కాగా ప్రస్తుతం గోపిచంద్ సంపత్ నంది దర్శకత్వంలో సిటీమార్‌లో నటిస్తోన్న విషయం తెలిసిందే. (త్వరలోనే పవన్ ‘వకీల్ సాబ్’లో జాయిన్ అవుతా.. అభిమానుల ప్రశ్నలకు శ్రుతీ హాసన్ సమాధానాలు)