క్వారంటైన్ బబుల్‌లో రానా, సాయి పల్లవి.. షూటింగ్‌కి రెడీ అవుతోన్న ‘విరాట పర్వం’ టీమ్
రానా, సాయి పల్లవిలు హీరో హీరోయిన్లుగా వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న చిత్రం విరాట పర్వం. గత ఏడాదిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా
Virata Parvam Shooting: రానా, సాయి పల్లవిలు హీరో హీరోయిన్లుగా వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న చిత్రం విరాట పర్వం. గత ఏడాదిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. చాలా భాగం చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ని తిరిగి ప్రారంభించాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే వారం నుంచి వికారాబాద్ అడవుల్లో షూటింగ్‌కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్లు. (త్వరలోనే పవన్ ‘వకీల్ సాబ్’లో జాయిన్ అవుతా.. అభిమానుల ప్రశ్నలకు శ్రుతీ హాసన్ సమాధానాలు )
ఇక ఈ మూవీకి సంబంధించి చివరగా ఒక్క షెడ్యూల్ మాత్రమే ఉండగా.. 10 రోజుల్లో దాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారట. ఇక కరోనా నేపథ్యంలో పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారట. అందులో భాగంగా టీమ్ మొత్తానికి కరోనా టెస్ట్‌లు చేయడంతో పాటు వారందరినీ క్వారంటైన్ బబుల్‌లో పెట్టనున్నారట. అలాగే బయట వారిని షూటింగ్ ప్రదేశానికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. (నివర్ తుఫాన్.. పుదుచ్చేరిలో ఈ రాత్రి నుంచి 144 సెక్షన్.. తమిళనాట రెడ్ అలర్ట్)
కాగా ఈ మూవీలో రానా పోలీస్‌గా కనిపించనుండగా.. సాయి పల్లవి నక్సలైట్‌గా నటిస్తున్నారు. నందితా దాస్, ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. (జగిత్యాల జిల్లాలో దారుణం.. అల్లుడిని సజీవ దహనం చేసిన అత్తింటి వారు)