త్వరలోనే పవన్‌ ‘వకీల్‌ సాబ్‌’లో జాయిన్ అవుతా.. అభిమానుల ప్రశ్నలకు శ్రుతీ హాసన్‌ సమాధానాలు

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో శ్రుతీహాసన్‌ ఒకరు. అక్కడ తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు

  • Tv9 Telugu
  • Publish Date - 5:22 pm, Tue, 24 November 20
త్వరలోనే పవన్‌ 'వకీల్‌ సాబ్‌'లో జాయిన్ అవుతా.. అభిమానుల ప్రశ్నలకు శ్రుతీ హాసన్‌ సమాధానాలు

Shruti Vakeel Saab: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో శ్రుతీహాసన్‌ ఒకరు. అక్కడ తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడంతో పాటు.. అప్పుడప్పుడు వారితో ఇంటరాక్ట్‌ అవుతూ ఉంటారు శ్రుతీ. ఈ క్రమంలో తాజాగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ వకీల్ సాబ్‌ విషయాలను కూడా ఆమె పంచుకున్నారు. (నివర్ తుఫాన్‌.. పుదుచ్చేరిలో ఈ రాత్రి నుంచి 144 సెక్షన్‌.. తమిళనాట రెడ్‌ అలర్ట్‌

వకీల్‌ సాబ్‌లో తాను పవన్ సరసన నటిస్తున్నానని., వచ్చే నెలలో షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని ఆమె వివరించారు. ఇక పవన్‌, సూర్యలతో తాను రెండు కంటే ఎక్కువ చిత్రాల్లో నటించినట్లు ఆమె వివరించారు. అయితే రవితేజతో కూడా శ్రుతీ రెండోసారి నటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఓ బాలీవుడ్‌ చిత్రానికి సంతకం చేశానని, త్వరలోనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని శ్రుతీ తెలిపారు. కాగా కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరమైన శ్రుతీ ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నారు. తెలుగులో పాటు తమిళ్‌లోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. (జగిత్యాల జిల్లాలో దారుణం.. అల్లుడిని సజీవ దహనం చేసిన అత్తింటి వారు