పెరిగిన సోనూసూద్‌ క్రేజ్.. ‘ఆచార్య’ పాత్రలో పలు మార్పులు..!

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో సోనూసూద్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

పెరిగిన సోనూసూద్‌ క్రేజ్.. 'ఆచార్య' పాత్రలో పలు మార్పులు..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 18, 2020 | 12:48 PM

Sonu Sood Acharya: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఆచార్యలో సోనూసూద్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. చిరు మూవీలో నటించడం నిజంగా తన అదృష్టమని సోనూ ఓ సందర్భంలో వెల్లడించారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఇందులో సోనూసూద్ పాత్రలో పలు మార్పులు చేస్తున్నట్లు చేస్తోంది. (దగ్గరపడుతున్న పెళ్లి డేట్.. ఉదయ్‌పూర్‌లో అడుగెట్టిన మెగా డాటర్‌ నిహారిక)

లాక్‌డౌన్ వేళ ఎంతోమంది వలస కార్మికులకు సాయం చేసి దేవుడిగా మారాడు సోనూసూద్‌. ఇక ఇప్పటికీ ఆపదలో ఉన్న వారికి తన సాయం కొనసాగిస్తున్నారు. దీంతో ఆయనకు క్రేజ్‌ బాగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే కొరటాల, సోనూ పాత్రలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇక వాటికి చిరు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. (ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌.. స్పందించిన డిప్యూటీ సీఎం మనీష్‌ శిశోడియా)

కాగా సామాజిక సమస్యల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో చిరు నక్సలైట్‌గా, కాలేజీ ప్రొఫెసర్‌గా రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఆయన సరసన కాజల్‌ రెండోసారి నటించనున్నారు. అలాగే రామ్‌ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా.. అజయ్‌, హిమజ తదితరులు మిగిలిన పాత్రల్లో నటించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. (నటి గౌతమి ఇంట్లోకి చొరబడి.. గోడ కింద దాక్కొని.. ఆందోళన కలిగించిన వ్యక్తి)