Miss You: సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా ‘మిస్‌ యూ’ ట్రైలర్‌..

సిద్ధార్థ్‌, ఆశికా రంగనాథ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం 'మిస్‌ యూ' నవంబర్‌ 29వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు...

Miss You: సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర్‌..
Miss You Trailer
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 24, 2024 | 7:51 AM

సిద్ధార్థ్‌కు తెలుగులో.. మరీ ముఖ్యంగా లేడీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నువ్వొస్తానంటే నేను వద్దొంటానా’తో మంచి లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సిద్ధార్థ్‌.. పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా బొమ్మరిల్లు, ఓయ్‌, కొంచెం ఇష్టం కొంచం కష్టం వంటి చిత్రాలతో లేడీ ఆడియన్స్‌ బాగా చేరువయ్యాడు.

అయితే ఆ తర్వాత సిద్ధార్థ్‌ నుంచి ఈ స్థాయి లవ్‌ ఓరియెంట్‌ మూవీ రాలేదు. యాక్షన్‌, సీరియస్‌ పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. అయితే తాజాగా మళ్లీ ఒక ప్యూర్‌ లవ్‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. సిద్ధార్థ్‌ తాజాగా నటించిన చిత్రం మిస్‌ యూ. ఆశికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు ఎన్‌. రాజశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. 7 మైల్స్ పర్ సెకెండ్ బ్యానర్ పై తమిళ్ ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ సామ్యూల్ మాథ్యూ నిర్మిస్తున్న ఈ సినమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ చిత్రంపై ఆసక్తిని పెంచేసింది. చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్‌ మళ్లీ పూర్తి స్థాయి లవర్‌ బాయ్‌ రోల్‌లో కనిపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తొలి చూపులోనే హీరోయిన్‌తో ప్రేమలో పడిన హీరో జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకోబోయే సమయంలో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది. లాంటి ఆసక్తికరమైన అంశాలతో సినిమా ఉండనున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

మిస్ యూ ట్రైలర్..

ఇక ట్రైలర్‌ వచ్చే కొన్ని డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ‘మన జీవితాల్లో హర్రర్ & లవ్ స్టోరీ స్క్రిప్ట్స్ ఒకటే మావా’ అనే డైలాగ్‌ బాగుంది. మొత్తం మీద ట్రైలర్‌ చూస్తుంటే సిద్ధార్థ్‌ ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొడతాడన్న భావన కలుగుతోంది. ఇక పెళ్లి తర్వాత సిద్ధార్థ నటిస్తోన్న మొదటి లవ్‌ స్టోరీ ఇదే కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని నవంబర్‌ 29వ తేదీన ప్రపంచవ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా సిద్ధార్థ్‌కు మళ్లీ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ను తీసుకొస్తుందో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..