షారూక్‌కు షాక్

బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వొద్దంటూ జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటికి తేల్చి చెప్పింది. మాస్ కమ్యూనికేషన్స్‌లో ఆయనకు డాక్టరేట్ ఇస్తామని వర్సిటీ కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్ర మానవ వనరుల శాఖ స్పందిస్తూ ఆయనకు డాక్టరేట్ ఇవ్వొద్దని చెప్పింది. గతంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వ విద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌లో షారూక్ డాక్టరేట్ పొందారని, పదే పదే డాక్టరేట్లు పొందడం కూడా మంచిది కాదంటూ కేంద్ర […]

షారూక్‌కు షాక్
Follow us

| Edited By:

Updated on: Feb 23, 2019 | 6:25 AM

బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇవ్వొద్దంటూ జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటికి తేల్చి చెప్పింది. మాస్ కమ్యూనికేషన్స్‌లో ఆయనకు డాక్టరేట్ ఇస్తామని వర్సిటీ కేంద్రాన్ని కోరింది. దీనిపై కేంద్ర మానవ వనరుల శాఖ స్పందిస్తూ ఆయనకు డాక్టరేట్ ఇవ్వొద్దని చెప్పింది. గతంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వ విద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్స్‌లో షారూక్ డాక్టరేట్ పొందారని, పదే పదే డాక్టరేట్లు పొందడం కూడా మంచిది కాదంటూ కేంద్ర మానవ వనరుల శాఖ అభిప్రాయపడింది.