డాన్‌గా శర్వానంద్?

హైదరాబాద్: ఎప్పటికప్పుడు విభిన్న కథా చిత్రాలోతో ఆకట్టుకుంటున్న శర్వానంద్ ఈసారి మరో విభిన్న కథాంశంతో రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని సితారా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. అయితే విశేషమేమంటే ఈ సినిమాలో శర్వానంద్ పాత్రపై ఆసక్తి పెరిగింది. ఒక డాన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం తాజాగా విడుదల చేసిన పోస్టర్. మార్చి 6న శర్వానంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో […]

డాన్‌గా శర్వానంద్?
Follow us

|

Updated on: Mar 06, 2019 | 10:53 AM

హైదరాబాద్: ఎప్పటికప్పుడు విభిన్న కథా చిత్రాలోతో ఆకట్టుకుంటున్న శర్వానంద్ ఈసారి మరో విభిన్న కథాంశంతో రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని సితారా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. అయితే విశేషమేమంటే ఈ సినిమాలో శర్వానంద్ పాత్రపై ఆసక్తి పెరిగింది. ఒక డాన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం తాజాగా విడుదల చేసిన పోస్టర్. మార్చి 6న శర్వానంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఇందులో హ్యాపీ బర్త్‌డే శర్వా అని రాసి ఉంది. డాన్ క్యారెక్టర్ అంటూ వార్తలు వినిపించడానికి పోస్టర్‌లో శర్వా కనిపిస్తున్న తీరు బలం చేకూర్చింది. ఫుల్ గడ్డంతో పాటు స్లైలిష్ సూటు, కూలింగ్ గ్లాసెస్‌ పెట్టుకున్న శర్వా క్లాస్ డాన్‌లా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సీనిమాను శర్వా 27గా పిలుస్తున్నారు. అయితే త్వరలోనే టైటిల్‌ను వెల్లడించేందుకు ప్లాన్ చేస్తున్నారు. శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు.