RRR: నాటు నాటు పాటుకు కిర్రాక్ స్టెప్స్ వేయగలరా.. అయితే టీవీ9 స్క్రీన్‌పై కనిపించే ఛాన్స్ మీదే

|

Mar 10, 2023 | 6:10 PM

ట్రిపులార్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఏ క్షణాన బయటకొచ్చిందో గానీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టింది. సినిమా విడుదల కంటే ముందే ఈ పాట దేశాన్ని షేక్‌ చేసింది. ఇక సినిమా విడుదల తర్వాత ఈ పాటకు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు వేసిన డ్యాన్స్‌ సైతం అదే స్థాయిలో...

RRR: నాటు నాటు పాటుకు కిర్రాక్ స్టెప్స్ వేయగలరా.. అయితే టీవీ9 స్క్రీన్‌పై కనిపించే ఛాన్స్ మీదే
Natu Natu Song
Follow us on

ట్రిపులార్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఏ క్షణాన బయటకొచ్చిందో గానీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టింది. సినిమా విడుదల కంటే ముందే ఈ పాట దేశాన్ని షేక్‌ చేసింది. ఇక సినిమా విడుదల తర్వాత ఈ పాటకు ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు వేసిన డ్యాన్స్‌ సైతం అదే స్థాయిలో ప్రేక్షకులకు ఆకట్టుకుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుందీ పాట. ఇక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకున్న తర్వాత ఈ పాటకు ఇంటర్నేషనల్‌ క్రేజ్‌ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుందీ పాట.

విదేశీయులు సైతం ఈ పాటకు కాలు కదుపుతున్నారు. నాటు నాటు పాటకు స్టెప్పుల్లేస్తూ సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో నాటు నాటు డ్యాన్స్‌ వీడియోలు సైతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే పలు అంతర్జాతీ అవార్డులు అందుకున్న నాటు నాటు సాంగ్‌ ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది. మార్చి 12వ తేదీన జరగబోయే ఆస్కార్‌ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి చిత్ర యూనిట్ అమెరికా చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మరి ప్రపంచాన్ని ఊపేస్తున్న ఈ పాటకు మీకూ స్టెప్పులు వేయాలని ఉందా.? ఆ డ్యాన్స్‌ వీడియోను టీవీ9 తెరపై చూసుకోవాలనుందా.? అయితే మీకోసమే టీవీ9 ఒక బంపరాఫర్‌ను తీసుకొస్తోంది. నాటు నాటు పాటకు మీరు వేసిన స్టెప్పులను TV9 ప్లాట్‌ఫామ్‌పై మీ టాలెంట్‌ను ప్రపంచంతో షేర్ చేసుకోండి. ఇందుకోసం మీరు చేయల్సిందల్లా నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేస్తూ.. 30 సెకన్ల మీ వీడియోను 7032007222కు Whatsapp చేయడం మాత్రమే. మరెందుకు ఆలస్యం వెంటనే మీ వీడియోలను పంపించేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..