AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: అదంతా అబద్దం.. జబర్దస్త్‌లో మాకు ఇచ్చేది ఇంతే.. అసలు విషయం చెప్పిన షేకింగ్ శేషు

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ వేదికపై తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకులను అలరించాడు షేకింగ్ శేషు. తన కామెడీతో ఎంతో మంది ఆడియన్స్ ను నవ్వులుపూయించాడు. సినిమాల్లోనూ నటించి మెప్పించాడు షేకింగ్ శేషు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ లో జబర్దస్త్ తెచ్చిన మలుపు గురించి వివరించారు.

Jabardasth: అదంతా అబద్దం.. జబర్దస్త్‌లో మాకు ఇచ్చేది ఇంతే.. అసలు విషయం చెప్పిన షేకింగ్ శేషు
Shaking Seshu
Rajeev Rayala
|

Updated on: May 12, 2026 | 2:36 PM

Share

జబర్దస్త్ కార్యక్రమం కేవలం ఒక కామెడీ షో మాత్రమే కాదు, ఎంతోమంది కళాకారులకు జీవనోపాధిని, గుర్తింపును అందించింది.  జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ గా, హీరోలుగా, దర్శకులుగా కూడా మారారు.  తాజాగా జబర్దస్త్ గురించి షేకింగ్ శేషు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జబర్దస్త్ లో రెమ్యునరేషన్స్ గురుంచి శేషు మాట్లాడుతూ.. ఈ షోలో స్కిట్‌లు టీమ్ లీడర్‌ లే రాస్తారు. ఆర్టిస్టులను కూడా వారే ఎంపిక చేసుకుంటారు. పారితోషికాల విషయంలో మల్లెమాల సంస్థ టీమ్ లీడర్‌కు ఒక మొత్తాన్ని చెల్లిస్తుంది, ఆ మొత్తాన్ని టీమ్ లీడర్ తమ టీమ్ కు తమ ఇష్టం మేరకు పంచుతారని శేషు తెలిపారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమా పరిశ్రమలోని పద్ధతులతో పోల్చితే, జబర్దస్త్‌లో కూడా ఆర్టిస్ట్ విలువను బట్టి పారితోషికం నిర్ణయిస్తారని తెలిపారు. కొంతమంది కొత్త ఆర్టిస్టులు మొదట్లో ఎలాంటి పారితోషికం ఆశించకుండా, కేవలం జబర్దస్త్‌లో అవకాశం వస్తే చాలు, హైలైట్ అయితే చాలు అనే ఆలోచనతో పనిచేసిన సందర్భాలున్నాయని. ఇది వారికి గుర్తింపు తెచ్చిపెట్టి, భవిష్యత్తులో మంచి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. అయితే, ఎవరికీ అసలు పారితోషికం ఇవ్వకుండా ఉండరని, అందరికీ ఏదో ఒక రూపంలో చెల్లింపు ఉంటుందని తెలిపారు శేషు.

ఇది కూడా చదవండి : దట్ ఈజ్ పవర్ స్టార్..! ఆ రోజు పవన్ కళ్యాణ్ డ్రస్ మొత్తం రక్తం.. అయినా లెక్కచేయలేదు..

ఒకవేళ కొత్త ఆర్టిస్ట్ బాగా రాణిస్తే, అతనికి డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో లేదా టీమ్ లీడర్ బాధ్యతలు కూడా అప్పగించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. స్కిట్‌ల రెడీలో రిహార్సల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. స్టేజ్ మీద భయపడి స్కిట్ విఫలం కాకూడదనే ఉద్దేశంతో ట్రయల్స్, రిహార్సల్స్ నిర్వహిస్తారు. సీనియర్స్, సుడిగాలి సుధీర్ టీమ్ వంటివారు, తమ ఏకాగ్రత, గ్రాస్పింగ్ కారణంగా ఒక 10 నిమిషాల స్కిట్‌కు అరగంట నుండి ఒక గంట సమయం మాత్రమే రిహార్సల్స్‌కు సరిపోతుంది. వారు డైలాగులను , స్కిట్ ఫ్లో త్వరగా పట్టుకుంటారు. అయితే, కొత్త టీమ్‌లు, యువ కళాకారులు కొన్నిసార్లు 10-15 రిహార్సల్స్ కూడా అవసరపడతాయి. జబర్దస్త్ ఆర్టిస్టుల పారితోషికాలపై ఎప్పుడూ ఒక ఆసక్తి ఉంటుంది.

ఇది కూడా చదవండి : Puri Jagannath: ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్.. ఆయనలేకపోతే నేను లేను

జబర్దస్త్ ఆర్టిస్ట్ లకు లక్షల్లో రెమ్యునరేషన్ ఉంటుందని బయట రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. ఒకవేళ అలాంటి మొత్తాలు లభిస్తే, 300కు పైగా ఎపిసోడ్‌లలో పాల్గొన్న కళాకారులు ఎన్నో ఆస్తులు సంపాదించి ఉండేవారని ఉదాహరణగా పేర్కొన్నారు. వాస్తవానికి, ఒక స్కిట్‌కు పారితోషికం రూ. 40,000 నుంచి రూ. 50,000 రూపాయల వరకు ఉంటుందని, శేషు తన సొంత ఉదాహరణతో వెల్లడించారు. జబర్దస్త్ మరియు ఎక్స్‌ట్రా జబర్దస్త్ రెండు షోలలో ఒక్కో ఎపిసోడ్‌కు ఆరు టీమ్‌లు పాల్గొంటాయి. ఈ టీమ్‌ల పారితోషికాలలో వ్యత్యాసాలుంటాయి. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చలాకి చంటి, రాకెట్ రాఘవ వంటి టీమ్‌లకు ప్రజాదరణ, పర్ఫార్మెన్స్, వీక్షకుల సంఖ్య, విజయాల ఆధారంగా ఎక్కువ పారితోషికం లభిస్తుంది. వారి అనుభవం, పర్ఫామెన్స్ రేంజ్ ను బట్టి ఇది పెరుగుతుంది. వేరే యూట్యూబ్ ఛానెల్స్ నుండి ఆఫర్లు వచ్చినప్పుడు, బాండ్ ఒప్పందాలు ముగిసిన తర్వాత కళాకారులు మారే అవకాశం ఉంటుందని, ఇది వారి కెరీర్ వృద్ధికి ఒక సాధారణ భాగమని తెలిపారు శేష్. జబర్దస్త్‌లో విజయం, అలాగే క్రేజ్ రావడం అనేది తక్షణమే కాకుండా, సమయం, నిరంతర కృషిపై ఆధారపడి ఉంటుందని షేకింగ్ శేషు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆహా..! ఏం సాంగ్ మావ.. వింటుంటే నరాలు జివ్వుమనాల్సిందే.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న రొమాంటిక్ సాంగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జబర్దస్త్‌లో మాకు ఇచ్చేది ఇంతే..
జబర్దస్త్‌లో మాకు ఇచ్చేది ఇంతే..
పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇదిగో వీడియో
పొట్టేళ్ల పోటీలతో దద్దరిల్లిన మైదానం.. ఇదిగో వీడియో
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
'నీట్‌ యూజీ 2026 పరీక్ష రద్దు.. దర్యాప్తుకు సహకరిస్తాం..' ఎన్టీయే
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
నేను బీజేపీకి, మోడీకి సపోర్ట్ చేస్తా.. యాంకర్ రష్మీ పోస్ట్ వైరల్
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఆరుగురు కెప్టెన్లు ఒకటే తప్పు.. రూల్స్ చాలా స్ట్రిక్ట్ గురూ
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
ఇంట్లో టమాటాలు త్వరగా పాడవుతున్నాయా.. వారం రోజులైనా ఫ్రెష్‌గా..
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూయాలా.. అద్భతమైన చిట్కాలు ఇవే
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంది..? భారత్ ఏ స్థానంలో ఉంద
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట..
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!
ప్రపంచం పొదుపు బాటలో.. మోదీ పిలుపు వెనుక గ్లోబల్ అలర్ట్!