‘బాహుబలి 3’లో నటించాలనుకుంటున్నా: అవెంజర్స్ హీరో

| Edited By:

Mar 09, 2019 | 3:54 PM

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చకున్న ఇండియన్ సినిమాలలో ‘బాహుబలి’ ఒకటి. విజువల్ వండర్స్‌తో రెండు భాగాలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం హాలీవుడ్ స్టార్లను సైతం ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ మూడో భాగం వస్తే నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అవెంజర్ నటుడు సామ్యూల్ తెలిపాడు. అవెంజర్స్ ప్రమోషన్లలో […]

‘బాహుబలి 3’లో నటించాలనుకుంటున్నా: అవెంజర్స్ హీరో
Follow us on

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చకున్న ఇండియన్ సినిమాలలో ‘బాహుబలి’ ఒకటి. విజువల్ వండర్స్‌తో రెండు భాగాలుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, తమన్నా తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం హాలీవుడ్ స్టార్లను సైతం ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ మూడో భాగం వస్తే నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అవెంజర్ నటుడు సామ్యూల్ తెలిపాడు. అవెంజర్స్ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల భారత్‌కు వచ్చిన సామ్యూల్‌ను అవకాశం వస్తే ఏ ఇండియన్ సినిమాలో నటిస్తారు అన్న ప్రశ్నకు బాహుబలి 3 అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా అవెంజర్స్ సిరీస్‌లో నిక్ ఫ్యూరీ పాత్ర ద్వారా సామ్యూల్ అందరికీ సుపరిచితుడైన విషయం తెలిసిందే. మరి ఈ అవెంజర్స్ హీరో కోరికను రాజమౌళి తీరుస్తాడో లేదో చూడాలి.