సమంతా ‘ఓహ్ బేబీ’ షూటింగ్ పూర్తి..!

నందిని రెడ్డి డైరెక్షన్ లో స్టార్ హీరోయిన్ సమంతా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఓహ్ బేబీ’ అనే టైటిల్ తో తెరకెక్కించే ఈ చిత్రం గురించి ఒక్క వార్త కూడా బయటికి రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ రోజు పూర్తయిందట. ఈ విషయాన్ని హీరోయిన్ […]

సమంతా 'ఓహ్ బేబీ' షూటింగ్ పూర్తి..!
Follow us

|

Updated on: Mar 15, 2019 | 3:50 PM

నందిని రెడ్డి డైరెక్షన్ లో స్టార్ హీరోయిన్ సమంతా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఓహ్ బేబీ’ అనే టైటిల్ తో తెరకెక్కించే ఈ చిత్రం గురించి ఒక్క వార్త కూడా బయటికి రాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ రోజు పూర్తయిందట. ఈ విషయాన్ని హీరోయిన్ సమంతా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘నా జీవితంలో నాకు ఇష్టమైన క్యారెక్టర్ ను ఇంత బ్యూటిఫుల్ గా తీర్చిద్దినందుకు చాలా థాంక్స్ అంటూ డైరెక్టర్ నందిని రెడ్డికి కృతజ్ఞతలు’ తెలిపింది సమంతా.  కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో యంగ్ హీరో నాగ శౌర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇక ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది చిత్ర యూనిట్.