కళ్ళకు గంతలు కట్టుకొని దోశ తిరగేసిన మెగాస్టార్.. సినిమా చూస్తూ ఏడ్చేశానంటున్న చిరంజీవి..

కళ్ళకు గంతలు కట్టుకొని దోశ తిరగేసిన మెగాస్టార్.. సినిమా చూస్తూ ఏడ్చేశానంటున్న చిరంజీవి..

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా ఎదిగిన సమంత ప్రస్తుతం ఆహ ఓటీటీలో 'సామ్‏జామ్' అనే టాక్ షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు పాల్గొని సందడి చేశారు.

Rajitha Chanti

|

Dec 22, 2020 | 3:48 PM

తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‏గా ఎదిగిన సమంత ప్రస్తుతం ఆహ ఓటీటీలో ‘సామ్‏జామ్’ అనే టాక్ షో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు పాల్గొని సందడి చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఇందులోకి మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసింది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సమంత అడిగిన ప్రశ్నలకు చిరు నవ్వుతూ సమాధానాలు చెప్పారు. మీరు ఎప్పుడైనా సినిమా చూస్తూ ఏడ్చేశారా అంటూ సమంత అడగ్గా.. ఓ సినిమాకు వెళ్ళి ఏడ్చానని తెలిపారు. అనంతరం కిందకు వంగి కళ్ళు తుడుచుకుంటూ ఉండగా.. థియోటర్ వాళ్ళు లైట్స్ వేశారని.. తాను పైకి లేచేసరికి పైట తన చేతిలో ఉందని తెలిపారు. ఆ తర్వాత చేతులు, కాళ్ళు లేని బాలుడు తన నోటితో చిరంజీవి మెయింట్ వేశాడు. అది చూసి ఆ బాలుడిని సంతోషంగా మెచ్చుకున్నారు చిరు. అనంతరం కళ్ళకు గంతలు కట్టుకొని దోశను తిరగేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25 నుంచి ఈ షో రాబోతోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu