ఎన్నికల ప్రచారానికి దూరంగా సల్మాన్..!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు సినిమా తారలకు గేలం వేస్తున్నారు. సినిమా తారలతో ప్రచారం చేయించి.. ఓటర్లను ఆకర్షించవచ్చని వారు ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు సినీ గ్లామర్ తో కళకళలాడుతున్నాయి. కాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ప్రచారం చేయించుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ట్రై చేస్తున్నాయట. అయితే ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా సల్మాన్ ఖాన్ స్పందించాడు. ‘ఏ పార్టీకి తాను ప్రచారం చేయడం లేదని. […]

  • Ravi Kiran
  • Publish Date - 5:21 pm, Thu, 21 March 19
ఎన్నికల ప్రచారానికి దూరంగా సల్మాన్..!

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు సినిమా తారలకు గేలం వేస్తున్నారు. సినిమా తారలతో ప్రచారం చేయించి.. ఓటర్లను ఆకర్షించవచ్చని వారు ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని రాజకీయ పార్టీలు సినీ గ్లామర్ తో కళకళలాడుతున్నాయి. కాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ప్రచారం చేయించుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ట్రై చేస్తున్నాయట.

అయితే ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా సల్మాన్ ఖాన్ స్పందించాడు. ‘ఏ పార్టీకి తాను ప్రచారం చేయడం లేదని. ఇక ఏ పార్టీ నుంచి కూడా తాను పోటీ చేయడం లేదని’ తెలిపాడు. అంతేకాదు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని.. రాజ్యాంగం మనకు కల్పించిన ఆయుధం ఓటు అని.. ఓటుతో సరైన నాయకుడిని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత అందరికి ఉందని సల్మాన్ ఖాన్ తన అభిమానులకు స్పష్టం చేశాడు.