‘మహర్షి’కి సల్లూభాయ్ దూరం..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా మే 9న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఈమేరకు ఆయన హిందీ రైట్స్ కూడా కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే ఈ రూమర్స్ పై ఇటీవల ‘భారత్’ సినిమా ప్రమోషన్స్‌లో సల్మాన్ ఖాన్ స్పందించాడు. […]

'మహర్షి'కి సల్లూభాయ్ దూరం..!
Follow us

|

Updated on: May 28, 2019 | 6:08 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా మే 9న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని హిందీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి. ఈమేరకు ఆయన హిందీ రైట్స్ కూడా కొనుగోలు చేసినట్లు చెప్పారు. అయితే ఈ రూమర్స్ పై ఇటీవల ‘భారత్’ సినిమా ప్రమోషన్స్‌లో సల్మాన్ ఖాన్ స్పందించాడు.

‘మహర్షి’ సినిమా రీమేక్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అసలు తాను సినిమానే చూడలేదని చెప్పుకొచ్చారు. దీంతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘భారత్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తుండగా.. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది.