RRR Movie update : ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే అప్‌‌‌డేట్ వచ్చేసింది.. అభిమానులకు పూనకాలే

ఆర్ఆర్ఆర్ చిత్రంకి సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తూ వ‌స్తున్నారు.  ఈ సినిమాలోఅల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్

RRR Movie update :  ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే అప్‌‌‌డేట్ వచ్చేసింది.. అభిమానులకు పూనకాలే

Edited By:

Updated on: Jan 25, 2021 | 2:08 PM

RRR Movie update : ఆర్ఆర్ఆర్ చిత్రంకి సంబంధించిన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తూ వ‌స్తున్నారు.  ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్లు సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసాయి. తాజాగా ఈ సినిమానుంచి  అప్ డేట్ ఇచ్చారు జక్కన్న. ‘

(సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు `ఆర్ఆర్ఆర్` సినిమాకు సంబంధించి అప్‌డేట్ బయటకు రానుందని చిత్రయూనిట్ ప్రకటించిన దగ్గరనుంచి అభిమానులంతా ఎలాంటి అప్ డేట్ ఇస్తారా అని ఆసక్తిగా ఎదురుచూసారు. కాగా ఈ సినిమానుంచి అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్. గుర్రం పై రామ్ చరణ్, బుల్లెట్ పై తారక్ దూసుకువెళ్తున్న ఫోస్టర్ ను రిలీజ్ చేశాడు జక్కన్న. దాంతో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా అక్టోబర్ 13న 2021 ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ ఈ జనవరి 8 న విడుదలయ్యేది. కానీ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసేసింది.