Shah Rukh Khan movie : షారుక్ ఖాన్ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్

Shah Rukh Khan movie : షారుక్ ఖాన్ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన చిత్రయూనిట్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ అభిమానులు ఉన్నారు. ఆయన నుంచి ఏదన్నా సినిమా వస్తోందంటే ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చేస్తుంటాయి. షారుక్ కంటే ఆయన అభిమానులే సినిమాను ఎక్కువ ప్రమోట్ చేస్తారు.

Rajeev Rayala

|

Jan 21, 2021 | 5:36 AM

Shah Rukh Khan movie : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌కు ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ అభిమానులు ఉన్నారు. ఆయన నుంచి  సినిమా వస్తోందంటే ఫ్యాన్స్‌కి పండగే . షారుక్ కంటే ఆయన అభిమానులే సినిమాను ఎక్కువ ప్రమోట్ చేస్తారు. అయితే 2016 నుంచి 2019 వరకు షారుక్ నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్సే. దాంతో ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. ‘డియర్ జిందగీ ‘‘రయీస్’, ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’, ‘జీరో’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ రావడంతో షారుక్ కూడా డిస్టర్బ్ అయిపోయారు.

అయితే  ప్ర‌స్తుతం సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ష‌న్ లో ప‌ఠాన్ చిత్రం చేస్తున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్. ముంబైలో షూటింగ్ కొన‌సాగుతుంది. అయితే ఈ సిన్ ఇమా షూటింగ్ ఆగిపోయిందంటూ బీటౌన్ లో వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఇటీవ‌లే సిద్దార్థ్ ఆనంద్ త‌న అసిస్టెంట్ డైరెక్ట‌ర్ తో గొడ‌వ ప‌డ‌టంతో షూటింగ్ నిలిచిపోయిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త పై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్.. సిద్దార్థ్ త‌న టీంతో  ఎప్పటినుంచో నుంచి మంచి అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నాడు. టీం మెంబ‌ర్స్ అంతా సిద్ధార్థ్ ఆనంద్ ను త‌మ సోద‌రుడిగా భావిస్తారు అని చెప్పుకొచ్చారు. దాంతో సిద్దార్థ్ ఆనంద్‌, ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కు మ‌ధ్య యుద్ధం జ‌రిగింద‌న్న వార్త‌లు నిరాధార‌మైన‌వని తేలిపోయింది. ఈ సినిమా తర్వాత షారుక్ సౌత్  సూపర్ హిట్ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu