‘ఆర్ఆర్ఆర్’లో ఆ తమిళ స్టార్ హీరో..? అదే నిజమైతేనా..!
టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం).

టాలీవుడ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం). బాహుబలి బ్లాక్‌బస్టర్ హిట్ తరువాత జక్కన్న తెరకెక్కిస్తోన్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పలు భారతీయ భాషల్లో వచ్చే ఏడాది జనవరి 8న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. ఇక క్రేజీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ అంచనాలను మరింత పెంచడానికి పలు భాషలకు చెందిన నటీనటులను ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం చేశారు రాజమౌళి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌లో తమిళ స్టార్ హీరో భాగం కాబోతున్నారట.
కోలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతోన్న విజయ్‌ను ఈ సినిమాలో అతిథి పాత్ర చేయించాలని రాజమౌళి అనుకుంటున్నారట. దీనిపై ఆయనను సంప్రదించాలని జక్కన్న భావిస్తున్నారట. రాజమౌళి సినిమా అంటే అందులో అతిథి పాత్రనైనా చేయాలనుకుంటారు ఎవరైనా. ఇక ఈ విషయంలో విజయ్ సానుకూలంగా స్పందిస్తే.. ఆర్ఆర్ఆర్‌కు మరింత కలర్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో చెర్రీ అల్లూరి సీతారామరాజు.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Read This Story Also: కేటీఆర్ విన్నపం.. ‘ఎస్ బ్రదర్’ అన్న పవన్..!